రోహిత్ శర్మకు టిప్స్ ఇస్తూ కనిపించిన విరాట్... ‘హిట్ మ్యాన్’ ఫెయిల్ అయితే కోహ్లీకి...

First Published Jun 18, 2021, 8:56 PM IST

రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీకి మధ్య మనస్పర్థలు ఉన్నాయని, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదని రెండేళ్ల పాటు వార్తలు షికార్లు చేశాయి. అయితే ఎట్టకేలకు ఈ వార్తలకు ఇంగ్లాండ్ సిరీస్‌లో ఫుల్‌స్టాప్ పడింది. ఇంగ్లాండ్‌ సిరీస్ తర్వాత చేసుకున్న పార్టీలో ఈ ఇద్దరూ క్లోజ్‌గా మూవ్ అవుతూ కనిపించారు...

ఇంగ్లాండ్ పిచ్‌ల మీద రోహిత్ శర్మకు టెస్టుల్లో పెద్దగా చెప్పుకోదగ్గ రికార్డు లేదు. ఓపెనర్‌గా తొలిసారి రోహిత్ శర్మ, ఇంగ్లాండ్ పిచ్‌ల మీద ఏ మాత్రం అనుభవం లేని శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఆడనున్నాడు...
undefined
గత పర్యటనలో ఇంగ్లాండ్‌లో 500+ పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, సౌంతిప్టన్‌లో ఫైనల్‌కి ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ శర్మకు సలహాలు, సూచనలు ఇస్తూ కనిపించాడు... అంతేకాదు రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే, విరాట్ కోహ్లీ అతనికి బౌలింగ్ కూడా చేశాడు.
undefined
టీమిండియా ప్రస్తుత జట్టులో ఇద్దరు సూపర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలా కనిపించడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్లు ఖుష్ అవుతున్నారు. అయితే కోహ్లీ ఫ్యాన్స్‌ని ఓ భయం కలవరపెడుతోంది...
undefined
రోహిత్ శర్మకు విదేశీ పిచ్‌లపై ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు. అక్కడ అతని యావరేజ్ కేవలం 27 మాత్రమే. ఇప్పటిదాకా విదేశాల్లో ఒక్క టెస్టు సెంచరీ కూడా చేయలేకపోయాడు... అయితే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కోహ్లీ, పూజారా, రహానే కంటే మెరుగైన సగటుతో పరుగులు చేశాడు రోహిత్ శర్మ...
undefined
స్వదేశంతో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్‌లతో జరిగిన సిరీసుల్లో రోహిత్ శర్మ సెంచరీల మోత మోగించడంతో అతను 60+ సగటుతో 1030 పరుగులు చేసి, రహానే తర్వాతి స్థానంలో ఉన్నాడు. రహానే 1090 పరుగులు చేసినా, అతని సగటు 50లోపే ఉంది...
undefined
ఇప్పుడు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రోహిత్ శర్మ విఫలమైతే, దానికి కారణం విరాట్ కోహ్లీ ఇచ్చే టిప్సే అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నారు ‘హిట్ మ్యాన్’ ఫ్యాన్స్... తమ ఫెవరెట్ క్రికెటర్‌ను సపోర్ట్ చేయడానికి కొందరు వీరాభిమానులు సాకులు వెతుకుతూ ఉంటారు...ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో ఆఖరి నాలుగు ఓవర్లు కెప్టెన్సీ చేసిన రోహిత్ శర్మకు ఆ మ్యాచ్ క్రెడిట్ అప్పగించారు ఫ్యాన్స్. అప్పట్లో ఈ విషయం గురించి చాలా పెద్ద చర్చే జరిగింది.
undefined
అలాగే ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సక్సెస్ అయితే, ఆ క్రెడిట్ విరాట్ కోహ్లీ చెప్పిన సలహాలు, సూచనల వల్లే అంటూ ప్రచారం చేయడానికి ఆయన వీరాభిమానులు రెఢీగా ఉంటారు...
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఈ ఇద్దరూ రాణిస్తే చూడాలనేది అసలు సిసలైన టీమిండియా ఫ్యాన్స్ కోరిక. కోహ్లీ 71వ సెంచరీ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అలాగే విదేశాల్లో రోహిత్ తొలి సెంచరీ కూడా వెయిటింగ్ లిస్టులోనే ఉంది
undefined
ఈ రెండూ ఫైనల్‌లో వస్తే... భారత జట్టు విజయం పెద్ద కష్టమేమీ కాదు. అదీకాకుండా రోహిత్ శర్మ సెంచరీ చేసిన ప్రతీ టెస్టులోనూ భారత జట్టు అద్భుత విజయాలు అందుకుంది...
undefined
click me!