ICC WTC Final: తొలి రోజు ఆట రద్దు... ఎగతెడపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా...

Published : Jun 18, 2021, 07:29 PM ISTUpdated : Jun 18, 2021, 07:32 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రోజు ఆట రద్దయ్యింది. వరుస విరామాల్లో వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో లోకల్ టైమ్ 2:40 నిమిషాల వరకూ ఎదురుచూసిన మ్యాచ్ రిఫరీ, ఇక తొలిరోజు ఆట సాధ్యం కాదని తేల్చేశారు...

PREV
16
ICC WTC Final: తొలి రోజు ఆట రద్దు... ఎగతెడపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా...

తొలి రోజు ఆట రద్దు కావడంతో రిజర్వు డేగా పరిగణించిన జూన్ 23 కూడా ఫైనల్‌లో అధికారికంగా చేరింది. అంటే జూన్ 19 నుంచి 23 వరకూ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇకపై వర్షం కారణంగా ఓవర్లు, లేదా సెషన్లు రద్దు అయినా వాటిని పూర్తి చేయడానికి వీలు ఉండదు.

26

సౌంతిప్టన్‌లో రేపు కూడా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మ్యాచ్ ఎప్పుడు ఆరంభం అవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు...

36

వర్షం కారణంగగా తొలి రోజు రద్దయినా ఓవర్లు నష్టపోకుండా ఉండేందుకు రేపటి నుంచి రోజుకి 98 ఓవర్లు బౌలింగ్ చేయాలని నిర్ణయించారు... రేపు షెడ్యూల్ కంటే అరగంట ముందుగానే మ్యాచ్ ఆరంభం కానుంది.

46

వర్షం కురవకముందు డ్రై పిచ్, స్పిన్‌కి అనుకూలిస్తుందని పిచ్ క్యూరేటర్, ఎక్స్‌పర్ట్స్ తెలియచేశారు. దీంతో వర్షం కురిసిన తర్వాత తేమ ఉన్న పిచ్‌పై స్పిన్నర్‌కి బదులుగా అదనంగా మరో పేసర్‌ని ఆడించేందుకు భారత జట్టు ప్రయత్నాలు జరపవచ్చని టాక్ వినిపిస్తోంది.

56

ఇప్పటికే భారత జట్టు 11 మందితో కూడిన టీమ్‌ను ప్రకటించేసింది. అయితే తొలి రోజు టాస్ వేయడానికి కూడా వీలుకాకపోవడంతో ఆ లిస్టు ఇంకా రిఫరీ చేతుల్లోకి వెళ్లలేదు.

66

కాబట్టి టాస్ వేసే ముందు వరకూ కూడా అవసరమైతే జట్టులో మార్పులు చేసేందుకు భారత జట్టుకు అవకాశం ఉంటుంది. రవీంద్ర జడేజా స్థానంలో మహ్మద్ సిరాజ్‌కి అవకాశం కలిగించవచ్చని టాక్ వినిపిస్తోంది... 

click me!

Recommended Stories