Ind vs Pak: ఇది దారుణ పరాజయం కాదు.. అంతకుమించి.! సుత్తెతో దింపారు.. భారత జట్టు ఓటమిపై గవాస్కర్ కామెంట్స్

First Published Oct 25, 2021, 1:55 PM IST

T20 Worldcup2021: ఇండియా పరాభవంపై భారత  దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. భారత్ కు ఇది ఘోర పరాజయం మాత్రమే కాదని, అంతకు ఎన్నో రెట్లు మించిన వేదన అని అభివర్ణించాడు.

నిన్నటి మ్యాచ్ లో  ఇండియాపై పాకిస్థాన్ సాధించిన 10 వికెట్ల విజయాన్ని భారత అభిమానులు ఎలా జీర్ణించుకుంటున్నారో గానీ.. సీనియర్ భారత  క్రికెటర్లకు మాత్రం ఇది మింగుడుపడటం లేదు. 
 

నిన్నా మొన్నటి దాకా.. అంతెందుకు.. మ్యాచ్ కు ముందు వరకూ భారత్ దే విజయం అనుకున్న వారి అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమర్థవంతంగా రాణించిన పాకిస్థాన్ జట్టు చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది.

ఇండియా పరాభవంపై భారత  దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. భారత్ కు ఇది ఘోర పరాజయం మాత్రమే కాదని, అంతకు ఎన్నో రెట్లు మించిన వేదన అని అభివర్ణించాడు.  మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ తో జరిగిన చిట్ చాట్ లో సన్నీ మాట్లాడాడు. 

‘భారత్ కు సంబంధించినంతవరకు ఇది ఘోరపరాజయం మాత్రమే కాదు. సుత్తెతో కొట్టినంత పని’ అని అన్నాడు. అయితే భారత జట్టుకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో..  ఈ ఫలితాన్ని పక్కనబెట్టి ముందుకు సాగాలని భారత సారథి విరాట్ కోహ్లి తో పాటు ఆటగాళ్లకు సూచించాడు. 

రాబోయే మ్యాచ్ లలో భారత్ పుంజుకుంటుందుని ఆశిస్తున్నానని సన్నీ అన్నాడు. జరిగిందేదో జరిగిపోయింది కానీ తదుపరి మ్యాచ్ ల మీద దృష్టి పెట్టాలని సూచించాడు. 

భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కూడా ఈ మ్యాచ్ పై స్పందించాడు. పాక్ జట్టును తక్కువగా అంచనా వేయొద్దని అన్నాడు. తమదైన రోజున ఏ జట్టైనా ఎంతటి పెద్ద జట్టునైనా ఓడిస్తుందనడానికి ఇదే సాక్ష్యం అని చెప్పాడు. 

నెహ్రా స్పందిస్తూ.. ‘పాక్ సెమీస్ కు చేరదని చాలా మంది అంచనా వేశారు. ఇది టీ20 టోర్నీ. ఇక్కడ ఏమైనా జరుగవచ్చు. పాక్ గెలిచిన తీరును ప్రజలు గమనిస్తున్నారు’ అని ఈ లెఫ్టార్మ్ సీమర్ అన్నాడు. 

click me!