ఐసీసీ కవర్ ఫోటోగా విరాట్ కోహ్లీ పిక్... ‘కింగ్’ కోహ్లీకి మరో అరుదైన గౌరవం...

First Published Jun 18, 2021, 9:51 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీగా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరోసారి గౌరవించింది...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా క్రికెటర్లతో పాటు న్యూజిలాండ్ టీమ్ కూడా ఫోటోషూట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఫోటోషూట్‌లో కోహ్లీ దిగిన ఫోటోను ఐసీసీ, తన యూట్యూబ్ ఛానెల్ కవర్ ఫోటోగా పెట్టింది...
undefined
ట్విట్టర్‌లో విరాట్ కోహ్లీ, కేన్ విలియంసన్ కలిసి టెస్టు ఛాంపియన్‌షిప్ గదతో దిగిన ఫోటోను కవర్‌గా పెట్టిన ఐసీసీ, యూట్యూబ్ ఛానెల్‌లో మాత్రం కేవలం కోహ్లీ మాత్రమే హైలెట్ అయ్యేలా పిక్‌ను సెట్ చేసింది...
undefined
సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన అనితర సాధ్యమైన రికార్డులే లక్ష్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కెరీర్ సాగింది. ఇప్పటికే 70 అంతర్జాతీయ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీని, అందరూ ముద్దుగా ‘కింగ్’ కోహ్లీ అని పిలుస్తుంటారు...
undefined
2019 వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా కూడా విరాట్ కోహ్లీని ‘కింగ్’ వేషంలో చూపిస్తూ ఓ ఫోటోను పోస్టు చేసింది ఐసీసీ. దీనిపై పాక్ అభిమానులు తీవ్ర అభ్యంతరం చెప్పారు..
undefined
అయితే విరాట్ సాధించిన రికార్డులు, సెంచరీలు, పరుగులను పోస్టు చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)... కోహ్లీని ‘కింగ్’ అని పిలవాల్సిందేగా అంటూ పాక్ ఫ్యాన్స్ ట్రోల్స్‌కి గట్టి కౌంటర్ కూడా ఇచ్చింది...
undefined
విరాట్ కోహ్లీ ఫోటోను ఐసీసీ కవర్ ఫోటో పెట్టుకోవడంపై టీమిండియా ఫ్యాన్స్ సంబరపడుతున్నా, 2019 వన్డే వరల్డ్‌కప్‌లో జరిగినట్టే ఇది తేడా కొట్టదు కదా? అని అనుమానిస్తున్నారు కూడా...
undefined
2019లో చివరిగా సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో 71వ సెంచరీ మార్కును అందుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు...
undefined
వర్షం కారణంగా ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తొలి రోజు ఆటను రద్దు చేశారు అంపైర్లు. దీంతో రేపటి నుంచి రోజూ 98 ఓవర్లు ఆడించాలని నిర్ణయించారు. అయితే రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.
undefined
click me!