ప్రతీ నెలా ఐసీసీ అవార్డులు... రేసులో నిలిచిన రిషబ్ పంత్, అశ్విన్, సిరాజ్, నట్టూ...

First Published Jan 28, 2021, 9:45 AM IST

ఇంతకుముందు ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ఏడాదికి ఒక్కసారి ఉత్తమ క్రికెటర్ల అవార్డులను ప్రకటించేంది. అయితే ఇకపై ప్రతీ నెల అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఐసీసీ. ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ పేరటి సంవత్సరం పొడవునా, నెలకో క్రికెటర్‌కి ఈ అవార్డులను ఇవ్వనుంది ఐసీసీ....

గత నెలలో ఐసీసీ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్ల అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే... ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేట్‌‌’గా విరాట్ కోహ్లీ ఎన్నికయ్యాడు...
undefined
ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా దశాబ్దపు క్రికెట్ అవార్డులను ప్రకటించిన ఐసీసీ... ఇకపై ప్రతీ నెలా ఇదే తరహాలో క్రికెటర్లకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది...
undefined
ఐసీసీ ఓటింగ్ అకాడమీతో ఆన్‌లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు....
undefined
ఐసీసీ మంత్లీ ఓటింగ్‌లో పాల్గొనాలంటే ఐసీసీ వెబ్‌సైట్‌లో మీ ఈమెయిల్‌తో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది... దీనికి ఎలాంటి ఛార్జీ ఉండదు...
undefined
ఆన్‌లైన్ ఓటింగ్‌తో పాటు మాజీ క్రికెటర్లు, క్రికెట్ అండ్ స్పోర్ట్స్ జర్నలిస్టులు, క్రికెట్ బ్రాడ్‌కాస్టర్లు ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు...
undefined
జనవరి 2021 నెలకు సంబంధించిన ఐసీసీ మంత్లీ అవార్డుల నామినేషన్‌లో ఏకంగా ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు పోటీలో నిలిచారు...
undefined
ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన నాలుగో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 89 పరుగులతో టీమిండియాకి అద్భుత విజయాన్ని అందించిన రిషబ్ పంత్, ఈ అవార్డు నామినేషన్‌లో నిలిచాడు.
undefined
ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో బంతితో పాటు బ్యాటుతోనూ రాణించిన భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా మంత్లీ అవార్డు నామినేషన్లలో ఉన్నాడు.
undefined
ఆరంగ్రేటం టెస్టులోనే మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు, హాఫ్ సెంచరీతో అదరగొట్టిన యంగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ మంత్లీ అవార్డుల నామినేషన్లలో నిలిచాడు.
undefined
వీరితో పాటు మొదటి టెస్టులోనే అదరగొట్టిన నటరాజన్, ఆస్ట్రేలియా సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్ సిరాజ్... ఐసీసీ మంత్లీ అవార్డుల నామినేషన్లలో నిలిచారు...
undefined
వీరితో పాటు మొదటి వన్డేలో సెంచరీ చేసిన ఆఫ్ఘాన్ ప్లేయర్ రెహన్ముల్లా గుర్భాజ్, ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా ప్లేయర్ మారిజనే క్యాప్, డి క్లార్క్, పాక్ ప్లేయర్ నిడా దార్... జనవరి నెలకు సంబంధించిన ఐసీసీ అవార్డుల నామినేషన్లలో ఉన్నారు.
undefined
click me!