Chris Gayle: వచ్చే ఏడాది వస్తా.. ఆ రెండు జట్లలో ఒకదానికి కప్ అందిస్తా.. యూనివర్సల్ బాస్ కామెంట్స్

Published : May 08, 2022, 11:54 AM IST

TATA IPL 2022: ఐపీఎల్ రెండో సీజన్ నుంచి గత సీజన్ దాకా నిరాటంకంగా ఆడిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఈసారి మాత్రం ఆడటం లేదు. అయితే వచ్చే ఏడాది మాత్రం తాను తిరిగి ఈ లీగ్ కు వస్తానని అంటున్నాడు. 

PREV
16
Chris Gayle: వచ్చే ఏడాది వస్తా.. ఆ రెండు జట్లలో ఒకదానికి కప్ అందిస్తా.. యూనివర్సల్ బాస్ కామెంట్స్

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఈ ఏడాది ఐపీఎల్ లో భాగం కాలేకపోయాడు. తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదనే కారణంతో మనసు నొచ్చుకున్న  అతడు ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో తన పేరు కూడా రిజిష్టర్  చేసుకోలేదు. 

26

అయితే వచ్చే ఏడాది మాత్రం తాను  మళ్లీ ఐపీఎల్ కు వస్తానని, తనకు ఎంతో ఇష్టమైన  రెండు జట్లలో ఏదో ఒకదానికి టైటిల్ కూడా అందిస్తానని చెబుతున్నాడు.  

36

తాజాగా  ఓ ఆంగ్ల పత్రికతో క్రిస్ గేల్ మాట్లాడుతూ.. ‘వచ్చే ఏడాది నేను ఐపీఎల్ ఆడతా. వాళ్లకు నా అవసరం ఉంది. ఐపీఎల్ లో నేను ఇంతవరకు కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ కు  ప్రాతినిథ్యం వహించాను.. 

46

వచ్చే సీజన్ లో నేను ఆడి ఆర్సీబీ,  పంజాబ్ లలో ఏదో ఒక జట్టుకు ఆడితే వాటికి టైటిల్ సాధించేందుకు కృషి చేస్తాను..’అని చెప్పుకొచ్చాడు. గేల్ చెప్పినట్టు.. ఈ రెండు జట్లు ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గలేదు. 

56

2009 నుంచి ఐపీఎల్ ఆడుతున్న  గేల్.. తొలుత  కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు.  ఆ తర్వాత చాలా కాలం పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లో సభ్యుడిగా ఉన్నాడు. 2018 నుంచి 2021 దాకా పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. 

66

మొత్తంగా ఐపీఎల్ లో 142 మ్యాచులాడిన గేల్.. 4,965 పరుగులు చేశాడు.  అయితే గత రెండు సీజన్లుగా అతడి ఆట అంచనాలకు అనుగుణంగా లేదు. గతంలో ఆడినట్టు భారీ షాట్లు ఆడటంలో గేల్ విఫలమవుతున్నాడు. 2020 లో (288), 2021 లో (193) కలిపి 500 పరుగులు కూడా చేయలేదు ఈ జమైకన్ ఆటగాడు.  

click me!

Recommended Stories