ఆ ఇద్దరూ నాలాగే ఆడుతున్నారు, అయితే అవకాశాలు రావట్లేదు... యువరాజ్ సింగ్ కామెంట్...

First Published May 7, 2022, 10:31 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో కొందరు కుర్రాళ్లు సత్తా చాటుతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడుతున్న ఇద్దరు కుర్రాళ్ల బ్యాటింగ్ స్టైల్‌, తన బ్యాటింగ్ స్టైల్‌కి చాలా దగ్గరగా ఉందని అంటున్నాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్...

డేవిడ్ వార్నర్ లేకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఫుల్ టైమ్ ఓపెనర్‌గా మారిన యంగ్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ. 

ఐపీఎల్ 2022 సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన అభిషేక్ శర్మ, 324 పరుగులు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు...

Latest Videos


Yuvraj Singh

21 ఏళ్ల అభిషేక్ శర్మతో పాటు ఆల్‌రౌండర్ శివమ్ దూబేలపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్...

‘సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అభిషేక్ బ్యాటింగ్‌ చూస్తుంటే నాలాగే అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అతను ఆడే పుల్ షాట్, బ్యాక్ ఫుట్ షాట్... అచ్చు నేను ఆడినట్టే అనిపిస్తాయి...

Shivam Dube

సీఎస్‌కే ప్లేయర్ శివమ్ దూబే బ్యాటింగ్ స్టైల్‌ కూడా నా బ్యాటింగ్ చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అయితే అతను చాలా ఏళ్లుగా ఆడుతున్నాడు. ఇప్పటికే 28 ఏళ్లు కూడా వచ్చేశాయి...

శివమ్ దూబే పెద్దగా వన్డే క్రికెట్ ఆడలేకపోయాడు. ఈ ఇద్దరిలో చాలా టాలెంట్ ఉంది, అయితే రావాల్సినన్ని అవకాశాలు మాత్రం రావడం లేదు... ’ అంటూ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న శివమ్ దూబే, 8 మ్యాచుల్లో 247 పరుగులు చేశాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...
 

అయితే సీఎస్‌కే వరుస ఓటములతో టీమ్‌లో మార్పులు అనివార్యం కావడంతో మంచి ఫామ్‌లో ఉన్న శివమ్ దూబేని పక్కనబెట్టేశాడు ఎమ్మెస్ ధోనీ. దూబే స్థానంలో జట్టులోకి వచ్చిన సిమ్రాన్‌జీత్ సింగ్ 2 మ్యాచులు ఆడి 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

click me!