ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి మెంటర్‌గా వ్యవహరించాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ గంభీర్, బీజేపీలో చేరి తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే...
మెంటర్‌గా గౌతమ్ గంభీర్, లక్నో సూపర్ జెయింట్స్‌ని ప్లేఆఫ్స్‌కి చేర్చాడు. కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీతో ఓడి, నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది...
26
అంతకుముందు సీజన్లలో అనాలసిస్ట్‌గా, కామెంటేటర్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఐపీఎల్‌లో సంబంధాలు పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై మీడియా కాన్ఫిరెన్స్‌లో క్లారిటీ ఇచ్చాడు గౌతమ్ గంభీర్...
36
‘నేను ఐపీఎల్‌లో పని చేయడానికి ఓ కారణం ఉంది. ఢిల్లీలో నేను 5 వేల మంది భోజనాలు పెడుతున్నా. దీని కోసం నెలకి రూ.25 లక్షలు ఖర్చు అవుతోంది. అంటే ఏడాదికి రూ.2.75 కోట్లు నా జేబులోంచి పెడుతున్నా...
46
మరో రూ.25 లక్షలు పెట్టి లైబ్రేరీ కట్టించాను... ఎంపీ ల్యాడ్ ఫండ్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. ఎంపీల్యాడ్ ఫండ్ ద్వారా వచ్చే ఫండ్‌తో నా కిచెన్‌లో వంట సామాను కూడా కొనలేం...
56
వీటన్నింటికీ ఖర్చు పెట్టడానికి మా ఇంట్లో డబ్బులు కాచే చెట్టు లేదు కదా... అందుకే ఐపీఎల్‌లో పనిచేస్తూ సంపాదిస్తున్నా... ఆ డబ్బులతో 5 వేల మందికి అన్నం పెడుతున్నా...
66
ఐపీఎల్‌లో పని చేయడానికి కానీ, కామెంటరీ చెబుతున్నా అని చెప్పుకోవడానికి నాకు ఎలాంటి సిగ్గు పడడం లేదు... ఎందుకంటే నా అంతిమ లక్ష్యం ఆకలితో ఉన్నవారి కడుపు నింపడమే...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...