న్యూజిలాండ్‌కి మరో దెబ్బ... ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీశమ్ దారిలోనే మార్టిన్ గుప్టిల్...

Published : Nov 24, 2022, 10:46 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరిన న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత స్వదేశంలో టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌ని కూడా 1-0 తేడాతో కోల్పోయింది కివీస్. తాజాగా న్యూజిలాండ్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది...  

PREV
16
న్యూజిలాండ్‌కి మరో దెబ్బ... ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీశమ్ దారిలోనే మార్టిన్ గుప్టిల్...
Image credit: Getty

బీబీఎల్, సీపీఎల్, ది హండ్రెడ్, పీఎస్‌ఎల్... వంటి ఫ్రాంఛైజీ క్రికెట్ లీగుల్లో పాల్గొనేందుకు న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు న్యూజిలాండ్ సీనియర్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్... 2019 తర్వాత ఐపీఎల్‌లో అమ్ముడుపోలేదు మార్టిన్ గుప్టిల్...

26

ఇప్పటికే కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌తో పాటు ఆల్‌రౌండర్ జేమ్స్ నీశమ్ కూడా టీ20 లీగులకు అందుబాటులో ఉండేందుకు న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నారు. మార్టిన్ గుప్టిల్ నిర్ణయంతో ఇలా టీ20 లీగుల కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న న్యూజిలాండ్ ప్లేయర్ల సంఖ్య మూడుకి చేరింది...

36
Martin Guptill

సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న ట్రెంట్ బౌల్ట్, వచ్చే నెలలో జరిగే టీ20 బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తరుపున ఆడబోతున్నాడు. 36 ఏళ్ల మార్టిన్ గుప్టిల్, 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు...

46
Martin Guptill

‘నా దేశానికి ప్రాతినిథ్యం వహించడం చాలా గొప్ప గౌరవం. నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటా. అయితే పరిస్థితులను అర్థం చేసుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని తెలుసుకున్నా. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నప్పటికీ నేను టీమ్‌కి అందుబాటులో ఉంటాను. నా కుటుంబంతో మరింత సమయం గడిపేందుకు, టీ20 వరల్డ్‌లో మరింతగా నన్ను నిరూపించుకోవడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అనుకుంటున్నా...’ అంటూ ప్రకటించాడు మార్టిన్ గుప్టిల్...

56
Martin guptil

న్యూజిలాండ్ తరుపున 121 టీ20 మ్యాచులు ఆడిన మార్టిన్ గుప్టిల్, 3497 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తరుపున అత్యధిక టీ20 పరుగులు చేసిన మార్టిన్ గుప్టిల్, అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు. 

66

2009లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన మార్టిన్ గుప్టిల్, 47 టెస్టులు ఆడి 2586 పరుగులు చేశాడు. 198 వన్డేల్లో 7346 పరుగులు చేశాడు. 2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 237 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు మార్టిన్ గుప్టిల్... వన్డే వరల్డ్ కప్‌లో డబుల్ సెంచరీ బాదిన మొట్టమొదటి బ్యాటర్ గుప్టిల్.. 

click me!

Recommended Stories