నో డౌట్స్... ఫైనల్ గెలవబోయేది వాళ్లే, అయితే... ఆసీస్ టెస్టు టీమ్ కెప్టెన్ టిమ్ పైన్ కామెంట్...

First Published Jun 16, 2021, 12:24 PM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. జూన్ 18 నుంచి ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకోనుంది. ఫైనల్‌లో టీమిండియానే హాట్ ఫెవరెట్ అంటున్నాడు ఆసీస్ టెస్టు టీమ్ కెప్టెన్ టిమ్ పైన్.

ఆస్ట్రేలియా టూర్‌లో ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసి, ఘన విజయం సాధించింది టీమిండియా. ఈ విజయాన్ని మోసపూరితమైన విక్టరీగా అభివర్ణించిన టిమ్ పైన్, భారత జట్టు తమపై ఆధిక్యాన్ని కనబరిచి, ఛాంపియన్‌లా ఆడిందని మాట మార్చిన విషయం తెలిసిందే...
undefined
‘వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియానే విజేతగా నిలుస్తుంది. అందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అయితే ఇంగ్లాండ్‌లో న్యూజిలాండ్ జట్టును ఓడించాలంటే ది బెస్ట్ టీమ్‌ను ఆడించాల్సి ఉంటుంది...
undefined
ఎందుకంటే టీమిండియాతో పాటు న్యూజిలాండ్ కూడా చాలా పటిష్టంగా కనిపిస్తోంది. వాళ్లు ఇప్పటికే ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లోనే ఓడించి, జోరు మీద ఉన్నారు...
undefined
అయితే న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ చేసిన తప్పు టీమిండియా చేయకూడదు. ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నా, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో వారిని ఆడించలేదు ఇంగ్లాండ్...
undefined
టీమిండియా ఆ తప్పు చేయదు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఐసీసీ ట్రోఫీ కావాలి. ఆ జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీని ఎంత సీరియస్‌గా తీసుకున్నారో నాకు తెలుసు...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్...
undefined
వాస్తవానికి న్యూజిలాండ్ కంటే ముందు ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించాల్సింది. అయితే మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో స్లో ఓవర్ రేటు కారణంగా వారి పాయింట్లలో కోత విధించింది ఐసీసీ.
undefined
అదీకాక కరోనా వైరస్ కేసుల కారణంగా సౌతాఫ్రికాతో జరగాల్సిన టెస్టు సిరీస్ వాయిదా పడింది. దీంతో విజయాలు సాధించినప్పటికీ ఆస్ట్రేలియా మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది..
undefined
‘ఇప్పుడు భారత జట్టులో రిజర్వు బెంచ్ చాలా బలంగా ఉంది. వారి దగ్గర కావాల్సినంతమంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఆస్ట్రేలియాకి ఇప్పుడు అలాంటి బ్యాకప్ ప్లేయర్లు కావాలి... అప్పుడే మళ్లీ ఆసీస్, వరల్డ్ క్రికెట్‌పై తన ఆధిపత్యాన్ని చూపించగలుగుతుంది’ అంటూ కామెంట్ చేశాడు టిమ్ పైన్.
undefined
ఆస్ట్రేలియా, త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అయితే బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా సీనియర్ ప్లేయర్లు ఈ టూర్‌కి దూరంగా ఉండబోతున్నారని ప్రచారం జరుగుతోంది...
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచుల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లకు అనుమతినిచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి వెళ్లాలా? వద్దా? అనేది ఆటగాళ్లే నిర్ణయించుకోవాలని వారి ఇష్టానికి వదిలేసింది...
undefined
click me!