భారత జట్టు దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి, ఐపీఎల్ అండగా ఉంది, అందుకే... పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్...

First Published Jun 16, 2021, 11:29 AM IST

అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు టీమిండియాపై, భారత జట్టు ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్. అన్ని ఫార్మాట్లలో అదరగొడుతూ, పటిష్టమైన రిజర్వు బెంచ్‌ను సొంతం చేసుకున్న టీమిండియా... పాక్, శ్రీలంకలను దాటేసి ముందుకు వెళ్లిందని ప్రశంసించాడు ఇంజమామ్.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్‌ టూర్‌కి వెళ్లిన టీమిండియా... మరో జట్టును శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు పంపేందుకు సిద్ధమైంది. ఒకేసారి రెండు భిన్నమైన జట్లతో రెండు విభిన్నమైన సిరీస్‌లు ఆడించడం చూసి యావత్ క్రికెట్ ప్రపంచం షాక్ అవుతోంది...
undefined
‘2010 దాకా భారత జట్టు కూడా శ్రీలంక, పాకిస్తాన్‌లతో పోటీపడుతూ ఉండేది. ఈ మూడు జట్ల ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండేది. కానీ ఈ పదేళ్లల్లో భారత జట్టు అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యింది... టీమిండియా ఇప్పుడు శ్రీలంక, పాక్‌ జట్ల కంటే దృఢంగా ఉంది...
undefined
భారత జట్టు ఇంత పటిష్టంగా తయారుకావడానికి ప్రధాన కారణం ఐపీఎల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను నిర్మించడంలో కూడా భారత జట్టు మంచి సక్సెస్ సాధించింది..
undefined
బీసీసీఐ దగ్గర కావాల్సినన్ని డబ్బులు దండిగా ఉన్నాయి. భారత ప్లేయర్లకు వరల్డ్ క్లాస్ సౌకర్యాలన్నీ దక్కుతున్నాయి. బోర్డు ఆటగాళ్ల ట్రెయినింగ్‌కి సకల సదుపాయాలు సమకూరుస్తోంది. ఇంకేం కావాలి...
undefined
అంతేకాకుండా బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌ను కూడా ఎంతో దృఢంగా నిర్మించింది. భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు దేశవాళీల్లో రాణించాలి. దేశవాళీల్లో రాణిస్తే, ఐపీఎల్‌లో చోటు దక్కుతుంది...
undefined
ఐపీఎల్‌లో ఛాన్స్ వస్తే, భారత జట్టులో చోటు దక్కకపోయినా రావాల్సినంత ఫేమ్, డబ్బులు వస్తాయి. భారత జట్టు సక్సెస్‌కి ఇదే కారణం. ఇక్కడే పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఫెయిల్ అయ్యాయి. ఈ రెండు జట్లు దేశవాళీ టోర్నీలపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్.
undefined
ఆస్ట్రేలియా టూర్‌లో ఆసీస్‌ను ఓడించి టెస్టు సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియాపై పొగడ్తల వర్షం కురిపించిన ఇంజమామ్ వుల్ హక్, కెప్టెన్ విరాట్ కోహ్లీని క్రికెట్ సూపర్ స్టార్‌గా అభివర్ణించాడు...
undefined
క్రికెట్‌ను రెండు దశాబ్దాలకు పైగా ఏలిన ఆస్ట్రేలియా కూడా ఒకేసారి రెండు భిన్నమైన జట్లతో రెండు టోర్నీలు ఆడించలేకపోయిందని, భారత జట్టు దాన్ని సాధ్యం చేసి చూపించిదని కొనియాడాడు ఇంజమామ్...
undefined
click me!