డ్రింక్స్ అడిగాను, వచ్చేలోపు అవుట్ అయిపోయా... శుబ్‌మన్ గిల్ కామెంట్...

First Published Apr 6, 2021, 1:22 PM IST

ఆస్ట్రేలియా టూర్‌లో చూడచక్కని షాట్లతో భవిష్యత్ స్టార్‌గా కనిపించాడు శుబ్‌మన్ గిల్. పృథ్వీషా స్థానంలో ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన శుబ్‌మన్ గిల్, ఆసీస్ టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్, రహానే, పూజారా తర్వాత ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

టెస్టు సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే గబ్బా టెస్టులో 91 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, కెరీర్‌లో తొలి సెంచరీ అందుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు...
undefined
146 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
undefined
‘గబ్బా టెస్టులో నేను సెంచరీ చేయాలని అనుకున్నా. అప్పటిదాకా పోరాడిన దానికి సెంచరీ వస్తే బాగుండని ఆశపడ్డా. అయితే 90ల్లోకి వచ్చిన తర్వాత కాస్త ఒత్తిడికి లోనయ్యాను...
undefined
ఒత్తిడి పెరుగుతుండడంతో డ్రింక్స్ తెమ్మని కోరాను... అయితే అదే ఓవర్ ఆఖరి బంతికి అవుట్ అయిపోయా. ఆ ఒక్క బంతిని డిఫెన్స్ ఆడి ఉంటే, సెంచరీ మార్క్ అందుకుని ఉండేవాడినేమో... ’ అంటూ చెప్పుకొచ్చాడు శుబ్‌మన్ గిల్...
undefined
ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్న శుబ్‌మన్ గిల్, గత సీజన్‌లో 14 మ్యాచులు ఆడి 440 పరుగులు చేశాడు అయితే అతని స్ట్రైయిక్ రేటుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి...
undefined
ఇప్పటిదాకా 41 మ్యాచులు ఆడిన శుబ్‌మన్ గిల్, 939 పరుగులు చేశాడు. శుబ్‌మన్ గిల్ స్ట్రైయిక్ రేటు 125.20 మాత్రమే. టీ20లను కూడా టెస్టుల్లా ఆడతాడని, అందుకే ఐపీఎల్ పర్ఫామెన్స్ తర్వాత అతను టెస్టు జట్టుకి ఎంపికయ్యాడని ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్...
undefined
2018ల అండర్ 19 వరల్డ్‌కప్ జట్టుకి నాయకత్వం వహించిన శుబ్‌మన్ గిల్, మొత్తంగా కలిపి 51 టీ20 మ్యాచులు ఆడి 1217 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలున్నాయి.
undefined
తన డిఫెన్స్ ఆటతీరుపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చిన శుబ్‌మన్ గిల్... ‘స్ట్రైయిక్ రేటు పెద్ద విషయమేమీ కాదు... నేను ఏ ప్లేయర్‌లా ఆడాలని అనుకోవడం లేదు, నాలాగే ఆడాలని అనుకుంటున్నా...
undefined
2021 సీజన్‌లో స్ట్రైయిక్ రేటు కూడా ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడతాను... ఓ కొత్త గిల్‌ను చూస్తారు’ అంటూ కామెంట్ చేశాడు శుబ్‌మన్ గిల్...
undefined
click me!