ఆ ప్లేయర్ కొనుగోలు వెనక అసలు కారణం ఇదే... అతను ఉంటే చాలు, టైటిల్ గెలవాల్సిందే...

Published : Apr 06, 2021, 11:10 AM IST

ఐపీఎల్ 2021 వేలంలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్‌ను రూ.4 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 37 ఏళ్ల ప్లేయర్ కోసం ఇంత భారీ మొత్తం చెల్లించడానికి ఆర్‌సీబీ సిద్ధం కావడంతో అంతా అవాక్కయ్యారు. అయితే అతని కొనుగోలు వెనక అసలు కారణం వేరే ఉందట...

PREV
18
ఆ ప్లేయర్ కొనుగోలు వెనక అసలు కారణం ఇదే... అతను ఉంటే చాలు, టైటిల్ గెలవాల్సిందే...

‘నాచురల్ ఆల్‌రౌండర్’గా గుర్తింపు పొందిన డానియల్ ట్రేవర్ క్రిస్టియన్, ఇప్పటిదాకా ఆస్ట్రేలియా తరుపున ఆడిన మ్యాచులు చాలా తక్కువ. తన కెరీర్‌లో 19 వన్డేలు, 16 టీ20 మ్యాచులు మాత్రమే ఆడాడు క్రిస్టియన్...

28

అయితే టీ20 లీగుల్లో మాత్రం డానియల్ క్రిస్టియన్ చాలా స్పెషలిస్టు ప్లేయర్... ఇప్పటిదాకా అతను ఆడిన టీ20 లీగ్‌లన్నింటిలో దాదాపు అన్నింట్లోనూ తన జట్లకి టైటిల్ అందించాడు క్రిస్టియన్...

38

2010లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్, 2011లో టీ20 బిగ్‌బాష్, 2013లో బీబీఎల్2, 2017లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్, 2017లో సీపీఎల్, 2018లో ఎస్‌ఏ సూపర్ లీగ్, 2019లో బీబీఎల్8, 2020లో ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్ టైటిల్ అందుకున్న జట్లలో సభ్యుడిగా ఉన్నాడు డానియల్ క్రిస్టియన్.

48

ఐపీఎల్‌లో మాత్రం ఇప్పటిదాకా టైటిల్ గెలవలేకపోయాడు. డెక్కన్ ఛార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు, రైజింగ్ పూణె జెయింట్స్, ఢిల్లీ డెర్‌డెవిల్స్ తరుపున ఆడిన డాన్ క్రిస్టియన్, ఇప్పటిదాకా 40 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు.

58

2011లో డెక్కన్ ఛార్జర్స్ తరుపున 14 మ్యాచులు ఆడిన డాన్ క్రిస్టియన్, ఐపీఎల్ కెరీర్‌లో 446 పరుగులు, 34 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 22 ఫోర్లు, 19 సిక్సర్లు ఉన్నాయి. 

68

‘మేం ఈసారి టైటిల్ గెలవబోతున్నాం. ఓ జట్టుగా విజయానికి కావాల్సినవన్నీ మా దగ్గర ఉన్నాయి. విజయానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ ఆడినప్పటి కంటే ఈసారి మంచి పర్ఫామెన్స్ ఇవ్వగలుగుతున్నా...

78

క్రిస్ గేల్ 175 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడినప్పుడు, నేను రిజర్వు బెంచ్‌లో కూర్చొని ఆ మ్యాచ్ చూశాను... ఈసారి అలాంటి పర్ఫామెన్స్‌లు మా జట్టు నుంచి చూడొచ్చు’ అని చెప్పాడు డాన్ క్రిస్టియన్..

88

కేల్ జెమ్మీసన్ రూ.15 కోట్లు, గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూ.14 కోట్ల 25 లక్షలు, డాన్ క్రిస్టియన్ రూ.4 కోట్ల 80 లక్షల పెట్టి కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీరి నుంచి భారీ పర్ఫామెన్స్ ఆశిస్తోంది...

click me!

Recommended Stories