నా పేరు లేకపోవడం చూసి షాక్ అయ్యా! నాతో ఏ సెలక్టర్ మాట్లాడలేదు... శిఖర్ ధావన్ కామెంట్స్...

Published : Aug 11, 2023, 11:00 AM IST

రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక అతని కంటే ఎక్కువ వన్డేలకు కెప్టెన్సీ చేశాడు శిఖర్ ధావన్. టెస్టు, టీ20లకు దూరమైన శిఖర్ ధావన్‌కి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు ఉంటుందని అనుకున్నారంతా. అయితే ఈ ఏడాది శిఖర్ ధావన్‌ని పూర్తిగా పక్కనబెట్టేసింది టీమిండియా మేనేజ్‌మెంట్...  

PREV
16
నా పేరు లేకపోవడం చూసి షాక్ అయ్యా! నాతో ఏ సెలక్టర్ మాట్లాడలేదు... శిఖర్ ధావన్ కామెంట్స్...
Shikhar Dhawan

అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కాబోతోంది. దానికి ముందు చైనాలో ఆసియా క్రీడల్లో మరో భారత జట్టు ఆడనుంది. ఆసియా క్రీడల్లో భారత జట్టుకి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించవచ్చని టాక్ వినబడింది...

26

అయితే ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులోనూ శిఖర్ ధావన్‌కి చోటు దక్కలేదు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్, రాహుల్ త్రిపాఠి, యశస్వి జైస్వాల్ వంటి ఐపీఎల్ స్టార్లతో కూడిన జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనబోతోంది..

36
Image credit: PTI

‘ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో నా పేరు లేకపోవడం చూసి నేను షాక్ అయ్యాను. అయితే సెలక్టర్లు కొత్తగా ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నట్టు అర్థమైంది. దాన్ని మనం అంగీకరించాల్సిందే..
 

46
Shikhar Dhawan

రుతురాజ్ గైక్వాడ్‌కి కెప్టెన్సీ దక్కడం సంతోషంగా ఉంది. టీమ్‌లో అందరూ కుర్రాళ్లే ఉన్నారు. వాళ్లు అదరగొడతారనే నమ్మకం ఉంది. టీమ్‌కి అవసరమైతే ఇప్పుడైనా రీఎంట్రీ ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా...

56
Image credit: PTI

టీమ్‌లోకి వచ్చేందుకు 1 శాతం అవకాశం ఉన్నా, దాన్ని వదులుకోదల్చుకోలేదు. ఇప్పటికీ నా ట్రైయినింగ్ బాగా సాగుతోంది. నా గేమ్‌ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా. అయితే కొన్ని విషయాలు మన ఆధీనంలో ఉండవు, వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకోకపోవడమే మంచిది..
 

66

సెలక్టర్లతో నేను ఏ విషయం మాట్లాడలేదు, ఏ సెలక్టర్లు నాతో ఏ విషయం గురించి చర్చించలేదు. ఇప్పటికైతే నేను బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్తున్నా, ట్రైయినింగ్ సెషన్స్‌లో పాల్గొంటున్నా.. ఫిజికల్‌గా, మెంటల్‌గా పూర్తి ఫిట్‌గా ఉన్నా..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్.. 

click me!

Recommended Stories