యువరాజ్ సింగ్ తర్వాత ఆ ప్లేస్‌లో ఆడే ప్లేయర్ దొరకడం లేదు... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్..

Published : Aug 11, 2023, 10:32 AM IST

వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్‌లో ఓడింది. అయితే గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీకి ఎంపిక చేసిన జట్టుపై తీవ్రమైన చర్చ జరిగింది. కారణం నాలుగో స్థానంలో సరైన ప్లేయర్‌ని ఎంపిక చేయకపోవడమే..

PREV
17
యువరాజ్ సింగ్ తర్వాత ఆ ప్లేస్‌లో ఆడే ప్లేయర్ దొరకడం లేదు... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్..
ambati rayudu

2019 వన్డే వరల్డ్ కప్‌కి ముందు అంబటి రాయుడు, వన్డేల్లో టీమిండియాకి నాలుగో ప్లేస్‌లో బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. 47 సగటుతో వన్డేల్లో రాణిస్తూ వస్తున్న అంబటి రాయుడిని వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీకి ఎంపిక చేయని సెలక్టర్లు, అతని ప్లేస్‌లో విజయ్ శంకర్‌కి ప్రపంచ కప్ టీమ్‌లో చోటు ఇచ్చారు..

27
Vijay Shankar, Virat Kohli

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వేసిన మొదటి బంతికే వికెట్ తీసిన విజయ్ శంకర్, నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడి వరల్డ్ కప్ 2019 టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతని ప్లేస్‌లో రిషబ్ పంత్‌ని వరల్డ్ కప్‌కి పంపింది టీమిండియా మేనేజ్‌మెంట్..

37
Rishabh Pant

అప్పటికే టీమ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, కెఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్ రూపంలో ముగ్గురు వికెట్ కీపింగ్ బ్యాటర్లు ఉన్నా, రిషబ్ పంత్‌ని కూడా జత చేయడం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

47

నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే బ్యాటర్ గురించి ఇంత రచ్చ జరిగి నాలుగేళ్లు అవుతున్నా... ఆ ప్లేస్‌లో సరైన బ్యాటర్‌ని ఇప్పటిదాకా క్రియేట్ చేయలేకపోయింది భారత జట్టు..
 

57

‘భారత జట్టుకి నెం.4 ప్లేస్ ఎప్పటి నుంచో సమస్యగా ఉంది.  యువరాజ్ సింగ్ తర్వాత ఆ ప్లేస్‌లో ఎవ్వరూ సెటిల్ కాలేకపోయారు. అలా వచ్చి ఇలా వెళ్లినవాళ్లే ఎక్కువ...

67

చాలా కాలం తర్వాత శ్రేయాస్ అయ్యర్, నెం.4 ప్లేస్‌లో బాగా బ్యాటింగ్ చేశాడు. ఆ ప్లేస్‌లో ఫిక్స్ అయ్యాడు. అతని గణాంకాలు కూడా బాగున్నాయి. కానీ గాయాలు జట్టును ఇబ్బందికి గురి చేస్తున్నాయి..

77

శ్రేయాస్ అయ్యర్ చాలా రోజులుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు టీమిండియాకి ఉన్న సమస్య ఇదే. 4-5 ఏళ్లుగా ఈ ప్లేస్ కోసం బ్యాటర్‌ని వెతుకుతూనే ఉన్నాం. చాలామంది ప్లేయర్లు గాయపడడంతో ప్రతీసారీ ఓ కొత్త ప్లేయర్‌ని నాలుగో స్థానంలో ఆడించాల్సిన పరిస్థితి వస్తోంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. 

Read more Photos on
click me!

Recommended Stories