పెయిన్ కిల్లర్లు వాడుతూ ఐపీఎల్‌లో బ్యాటింగ్ చేశా... స్టీవ్ స్మిత్ కామెంట్...

First Published Jul 4, 2021, 4:27 PM IST

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌, టీ20 వరల్డ్‌కప్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరన జరిగే యాషెస్ సిరీస్‌కి అందుబాటులో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్న స్మిత్, ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్‌ను, ఆ జట్టు వేలానికి వదిలేసింది. 2020 సీజన్‌లో ఆర్ఆర్, పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే...
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో స్టీవ్ స్మిత్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకే అతన్ని కొనుగోలు చేసింది...
undefined
అంతకుముందు సీజన్‌లో రూ.15 కోట్లు తీసుకున్న స్టీవ్ స్మిత్, రెండు కోట్ల కోసం కుటుంబానికి దూరంగా మూడు నెలల పాటు గడపడానికి ఇష్టపడకపోవచ్చని, అతను ఐపీఎల్‌కి రాడని అనుకున్నారందరూ...
undefined
అయితే ఆశ్చర్యకరంగా ఐపీఎల్ 2021 సీజన్‌ కోసం ఇండియాకి వచ్చిన స్టీవ్ స్మిత్, ఆరంగ్రేటం మ్యాచ్‌లో క్యాప్ అందుకుంటూ ఎమోషనల్ కూడా అయ్యాడు...
undefined
‘నేను ఐపీఎల్ సమయంలో నూరు శాతం ఫిట్‌గా లేదు. నా మోచేతి గాయం అప్పటికీ కాస్త వేధిస్తూనే ఉంది. మెడికేషన్ ఫాలో అవుతూ, పెయిన్ కిల్లర్ మందులు వాడుతూ ఐపీఎల్ 2021 సీజన్‌లో బ్యాటింగ్ చేశాను...
undefined
నేను టీ20ల్లో పెద్దగా రాణించలేకపోతున్నానని గ్రహించా. అందుకే ఎలాగైనా నన్ను నేను నిరూపించుకోవాలని చాలా ప్రయత్నించాను. కానీ అక్కడికి వెళ్లాక పరిస్థితి మరింత ఘోరంగా మరింది..
undefined
టీ20 వరల్డ్‌కప్‌కి ఇంకా సమయం ఉంది. అప్పటిదాకా కోలుకుంటానో లేదో తెలీదు. టీ20 వరల్డ్‌కప్ ఆడాలని నాకు కూడా ఉంది. అయితే టెస్టు క్రికెట్‌కే నా మొదటి ప్రాధాన్యం...’ అంటూ కామెంట్ చేశాడు స్టీవ్ స్మిత్...
undefined
స్టీవ్ స్మిత్‌ను రూ.2 కోట్లకే కొనుగోలు చేశారని తెలిసిన తర్వాత అతను ఆ చిల్లర కోసం ఇండియాకి వెళ్లి ఆడనని, ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటాడని కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్...
undefined
అయితే స్టీవ్ స్మిత్ మాత్రం ఆశ్చర్యకరంగా ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొని నాలుగు మ్యాచుల్లో 104 పరుగులు చేశాడు. సీనియర్ బ్యాట్స్‌మెన్ అయిన స్మిత్, యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడడం మరో విశేషం..
undefined
గాయం కారణంగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి దూరమైన స్టీవ్ స్మిత్, ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచుల్లో ఆడే అవకాశం లేదు. అయితే ఆ సమయానికి ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కోలుకుంటాడు. దీంతో ఢిల్లీకి పెద్ద నష్టం కలగకపోవచ్చు...
undefined
click me!