ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌కి టైటిల్ అందించాడు హార్ధిక్ పాండ్యా. అంతకుముందు టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో కూడా లేని హార్ధిక్, ఒక్కసారిగా భారత టీ20 కెప్టెన్ అయిపోయాడు. అయితే హార్ధిక్ ఓవర్ కాన్ఫిడెన్స్, టీమిండియాని తీవ్రంగా దెబ్బ తీస్తోంది..
ట్రినిడాడ్‌లో జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడింది. టీమిండియా చేసిన చిన్న చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
29
ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్‌లను రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసిన హార్ధిక్ పాండ్యా.. కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లకు తుది జట్టులో అవకాశం ఇచ్చాడు..
39
స్పిన్‌కి అనుకూలిస్తున్న పిచ్ మీద యజ్వేంద్ర చాహాల్ తన మొదటి ఓవర్‌లోనే 2 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ తీశాడు. అయితే కుల్దీప్ యాదవ్‌తో 4 ఓవర్లు వేయించిన హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌తో 2, యజ్వేంద్ర చాహాల్‌తో 3 ఓవర్లు మాత్రమే వేయించాడు..
49
ముగ్గురు స్పిన్నర్లతో పూర్తి కోటా వేయించి ఉంటే, వెస్టిండీస్‌ని మరింత తక్కువ స్కోరుకి పరిమితం చేసే అవకాశం దొరికి ఉండేది. అలా కాకుండా 2 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చిన అక్షర్ పటేల్‌ని కాకుండా చాహాల్‌తో 19వ ఓవర్ వేయించినా సరిపోయేది.. కానీ హార్ధిక్ పాండ్యా మాత్రం అలా చేయలేదు..
59
ఓపెనర్లు వెంటవెంటనే అవుటైన తర్వాత మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, నాలుగో స్థానంలో తిలక్ వర్మను పంపించిన హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్ కంటే తానే బ్యాటింగ్‌కి వచ్చాడు. ఇది కూడా టీమిండియా విజయావకాశాలను దెబ్బ తీసింది..
69
Chahal-Mukesh Kumar
చివరికి 8వ వికెట్ పడిన తర్వాత ఎవరిని బ్యాటింగ్‌కి పంపాలనే విషయంలో కూడా టీమ్‌కి క్లారిటీ లేకుండా పోయింది. కుల్దీప్ యాదవ్ అవుట్ అవ్వగానే యజ్వేంద్ర చాహాల్ క్రీజులోకి వచ్చేశాడు. ఆ తర్వాత ఉమ్రాన్ మాలిక్ వచ్చి వెనక్కి పిలిచేదాకా.. అతనికి ముకేశ్ కుమార్‌ని బ్యాటింగ్‌కి పంపారనుకున్న విషయం తెలియలేదు..
79
Kuldeep Yadav
ఇలాంటి చిన్న చిన్న విషయాలు, టీమ్ వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి. మొదటి మ్యాచ్ పోయినా మరో 4 మ్యాచులు ఉన్నాయి. అయితే వచ్చే ఏడాది జూన్‌లో వెస్టిండీస్‌లోనే టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. ఈ టోర్నీకి హార్ధిక్ పాండ్యానే కెప్టెన్సీ చేయబోతున్నాడు..
89
టీ20 వరల్డ్ కప్ గెలవడం, ఐపీఎల్ టైటిల్ గెలిచినంత ఈజీ అయితే కాదు. ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, నాలుగు సార్లు టీ20 వరల్డ్ కప్‌లో టీమ్‌కి టైటిల్ అందించలేకపోయాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలోనూ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది భారత జట్టు.
99
Hardik Pandya
కాబట్టి ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవగానే నాకంటే గొప్ప కెప్టెన్ లేడనే ఓవర్ కాన్పిడెన్స్‌ని నింపుకున్న హార్ధిక్ పాండ్యా, దాన్ని తగ్గించుకుంటేనే అతనికి, టీమిండియాకి మంచిదని అంటున్నారు ఫ్యాన్స్..