అతడి వ్యాఖ్యల వెనుక అర్థమేంటో అందరికీ తెలుసు.. నేను స్పందించను : టీమిండియా మాజీ హెడ్ కోచ్ పై...

First Published Jan 26, 2022, 11:27 AM IST

Sanjay Manjrekar: భారత మాజీ సారథి విరాట్ కోహ్లి ఎదుగుదలను   కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని ఇటీవలే వ్యాఖ్యానించిన టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలపై అతడి మాజీ సహచరుడు...
 

టీమిండియా మాజీ సారథి  విరాట్ కోహ్లి, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిల మధ్య ఉన్న  బంధం క్రికెట్ వరకే పరిమితం కాలేదు. వ్యక్తిగతంగా కూడా ఆ ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నాయి. రవిశాస్త్రి  కోచ్ గా ఉన్న సమయంలో కోహ్లి ఆడింది ఆట పాడింది పాట. కానీ  శాస్త్రి ఆ బాధ్యతల నుంచి విరమించుకున్నాక   కోహ్లికి అన్నీ తలకిందులయ్యాయి. 
 

టీమిండియా సారథి అన్న  ట్యాగ్ పోయి ఇప్పుడు  జట్టులో ఒక సాధారణ ఆటగాడిగా మారింది కోహ్లి పరిస్థితి. అయితే  కోహ్లిపై విమర్శలు చేసే వారిపై రవిశాస్త్రి మాత్రం విరుచుకుపడతాడు.  అతడి ఆటను గానీ,  సారథ్యాన్ని గానీ ఎవరైనా ఏమైనా అంటే వారికి కౌంటర్ ఇవ్వడంలో  శాస్త్రి ముందుంటాడు.

ఇటీవల   బీసీసీఐ- విరాట్ కోహ్లికి మధ్య తలెత్తిన విబేధాలు, బయట పలువురు సీనియర్లు, తాజా మాజీలు చేస్తున్న కామెంట్లపై కూడా శాస్త్రి ఇటీవల స్పందిస్తూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. కోహ్లి ఎదుగుదలను  వాళ్లు ఓర్చుకోలేకపోతున్నారని అన్నాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై  భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. అతడన్న వ్యాఖ్యల వెనుక ఎజెండా ఏంటో అందరికీ తెలుసునని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.

మంజ్రేకర్ మాట్లాడుతూ... ‘రవిశాస్త్రి అంటే నాకు అమితమైన అభిమానం. నేను అతడి సారథ్యంలో ఆడాను. ఆటగాళ్లకు అతడు బాగా మద్దతుగా నిలిచేవాడు. గొప్ప పోరాట యోధుడు. కానీ ఈ శాస్త్రి 2.0 (హెడ్ కోచ్)  మాత్రం నాకు అర్థం కావడం లేదు. 
 

ప్రజల ముందుకు వచ్చినప్పుడు అతడు ఏం మాట్లాడుతున్నాడో అంచనా వేయవచ్చు. నేను ఆ వ్యాఖ్యలపై స్పందించదలుచుకోలేదు. నేనేమీ  అగౌరవంగా ఉండాలనుకోవడం లేదు. అతడు (రవిశాస్త్రి) తెలివిగల వ్యాఖ్యలు చేయడు. ఆ వ్యాఖ్యల వెనుక ఎజెండాను మీరు చూడొచ్చు. క్రికెట్ పరిశీలకుడు చేయాల్సిన పని ఇది కాదు...’ అని అన్నాడు. 
 

68 టెస్టులలో భారత్ కు సారథిగా వ్యవహరించిన కోహ్లి.. మరో 14 టెస్టు విజయాలు సాధించి ఉంటే అత్యంత విజయవంతమైన సారథిగా రికార్డులకెక్కేవాడు. అయితే అతడి విజయాన్ని కొంతమంది ఓర్వలేరని ఇటీవలే శాస్త్రి అన్నాడు. టెస్టు సారథిగా మరో రెండేండ్లు భారత్ కు కెప్టెన్ గా ఉండేవాడని,  దాంతో రికార్డులకెక్కితే అది చాలా మంది జీర్ణించుకోలేరని శాస్త్రి వ్యాఖ్యానించాడు.  

click me!