Virat Kohli: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టుకు కోహ్లీ ఎంత సంపాదిస్తాడో తెలుసా..?

Published : Jul 22, 2022, 04:04 PM IST

Virat Kohli Instagram: సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఎన్ని లైకులు వచ్చాయి..? ఎంతమంది కామెంట్ చేశారు..? ఎంతమంది ఆ పోస్టును చూశారు..? అని చూసుకుంటాం మనం. కానీ కోహ్లీ అలా కాదు.

PREV
17
Virat Kohli: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టుకు కోహ్లీ ఎంత సంపాదిస్తాడో తెలుసా..?

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నా  సారథ్యం వదిలేశాక  అతడి మార్కెట్ తగ్గిందని విమర్శలు వస్తున్నా కోహ్లీ క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గడం లేదు.  పేలవ ఫామ్ లో ఉన్న  అతడు.. బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్, ఎండార్స్‌మెంట్స్ ద్వారానే గాక సోషల్ మీడియా ద్వారా కూడా కోట్లల్లో సంపాదిస్తున్నాడు.

27

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఎన్ని లైకులు వచ్చాయి..? ఎంత మంది కామెంట్ చేశారు..? ఎంతమంది చూశారు..? అని చూసుకుంటాం మనం. కానీ కోహ్లీ అలా కాదు. ఒక్క పోస్ట్ పెడితే ఎన్ని డబ్బులు తన బ్యాంక్ ఖాతాలో జమయ్యాయో చూసుకోవాల్సిందే. 
 

37

ప్రపంచ క్రికెట్ 70 సెంచరీల సాయంతో సుమారు 24వేల పరుగులు చేసిన ఈ పరుగుల యంత్రం ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టే ఒక్క పోస్టుకు సంపాదించే మొత్తం  $1,088,000. అంటే మన భాషలో చెప్పాలంటే అక్షరాలా రూ. 8 కోట్ల 69 లక్షలు.  

47

కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్ లో 20 కోట్ల (200,703,169)కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే కోహ్లీ పెట్టే ఒక్క పోస్టు వాళ్లందరికీ చేరాల్సిందే. వాళ్ల నుంచి ఇతరులకు షేర్ అవుతుంది. అందుకే ఇన్స్టా కూడా కోహ్లీకి భారీగా ముట్టజెపప్పుతున్నది.

57

ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్నవారి జాబితాలో కోహ్లీ 14వ స్థానంలో ఉన్నాడు. అదీగాక ఈ జాబితాలో టాప్-25లో ఉన్న సెలబ్రిటీలలో ఆసియా ఖండం నుంచి కోహ్లీ ఒక్కడే ఉండటం గమనార్హం.  

67

ఇక ఈ జాబితాలో ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో 44 కోట్ల (442,267,575) ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇన్స్టాలో రొనాల్డో పెట్టే ఒక్క పోస్టుకు $2,397,000 పొందుతున్నాడు. అంటే కోహ్లీ కంటే రెండింతలు (సుమారుగా 18 కోట్లు)  ఎక్కువ.  

77

మరో ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కూడా ఒక్క పోస్టు ద్వారా $1,777,000 ఆదాయం పొందుతాడని hopperhq.com తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. 

Read more Photos on
click me!

Recommended Stories