ఐపీఎల్ బాగా ఆడాడని టెస్టులకు ఎంపిక చేస్తారా? ఇదేం లాజిక్... అజింకా రహానే ఎంపికపై రికీ పాంటింగ్ కామెంట్...

Published : Jun 02, 2023, 03:15 PM IST

ఐపీఎల్ ముగిసిన తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 మ్యాచ్ ఆడనుంది టీమిండియా. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా వంటి కీ ప్లేయర్లు గాయపడినా టీమిండియా పటిష్టంగానే కనబడుతోంది..

PREV
17
ఐపీఎల్ బాగా ఆడాడని టెస్టులకు ఎంపిక చేస్తారా? ఇదేం లాజిక్... అజింకా రహానే ఎంపికపై రికీ పాంటింగ్ కామెంట్...
Ajinkya Rahane

అజింకా రహానేతో పాటు ఛతేశ్వర్ పూజారా టెస్టు టీమ్‌లోకి తిరిగి రాగా శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింకా రహానే బీభత్సమైన ఫామ్‌లో ఉండడం టీమ్‌కి కలిసి వచ్చే విషయం. వీరితో పాటు మహ్మద్ షమీ పర్పుల్ క్యాప్ గెలిచి వస్తుంటే, సిరాజ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. 

27

‘నేను టీమిండియాలో ఉంటే, ఈ మ్యాచ్ ప్రాముఖ్యం గురించి చెప్పేవాడిని. ఈ ఒక్క మ్యాచ్ గెలవడం కోసం ఇషాన్ కిషన్‌ని ఆడించేవాడిని. ఎందుకంటే అతను టీమ్‌కి ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు. టెస్టు మ్యాచ్ గెలవడానికి ఏం చేయాలో ఇషాన్ కిషన్‌కి బాగా తెలుసు..
 

37

రిషబ్ పంత్ ఫిట్‌గా ఉండి ఉంటే ఇషాన్ కిషన్ అవసరం ఉండేది కాదు. పంత్ లేకపోవడంతో కెఎస్ భరత్‌ని ఆడించాలని టీమిండియా అనుకుంటోంది. అయితే భరత్ కంటే ఇషాన్ కిషన్‌ని ఆడిస్తే టీమిండియాకి ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని అనుకుంటున్నా...

47

అజింకా రహానే ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడాడు. అయితే ఐపీఎల్‌లో బాగా ఆడాడని టెస్టుల్లోకి తిరిగి తీసుకురావడం కాస్త వింతగా ఉంది. రెండు ఫార్మాట్లు పూర్తిగా భిన్నమైనవి. అదీకాకుండా రహానే కొన్నేళ్లుగా టెస్టుల్లో పెద్దగా రాణించలేకపోయాడు...
 

57
PTI Photo) (PTI04_27_2023_000372B)

అయితే ఐపీఎల్‌లో అజింకా రహానే ఎంత కాన్ఫిడెంట్‌గా కనిపించాడో అందరూ చూశారు. అతని కాన్ఫిడెన్స్ టీమిండియాకి కచ్చితంగా హెల్ప్ అవుతుంది.. టెస్టుల్లో రహానే బాగా ఆడి గెలిపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి...

67
Image credit: PTI

టెస్టు టీమ్‌లోకి తిరిగి ఎంపికైన తర్వాత అజింకా రహానే ఆత్మవిశ్వాసం మరింత పెరిగి ఉంటుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో రహానే నుంచి సెంచరీ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఏ పిచ్‌ మీదైనా పరుగులు చేయగల హై క్వాలిటీ ప్లేయర్ అతను...

77
Image credit: Getty

ఫైనల్‌లో జడేజా, అశ్విన్ ఇద్దరినీ ఆడించాలి. ఎందుకంటే నెం.6లో జడ్డూ బ్యాటింగ్ టీమ్‌కి ఉపయోగపడుతుంది. అశ్విన్ కూడా మంచి బౌలర్‌ మాత్రమే కాకుండా బ్యాటర్ కూడా... బ్యాటింగ్‌కి అనుకూలించే ఓవల్‌లో ఈ ఇద్దరూ టీమ్‌కి అదనపు బలం అవుతారు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్.. 

click me!

Recommended Stories