మీకు ఇంగ్లీషు రాకుంటే నన్నేం చేయమంటార్రా.. నేను క్లీయర్‌గా చెప్పా కదా : కోహ్లీ ఫ్యాన్స్‌కు కౌంటరిచ్చిన దాదా

Published : May 24, 2023, 04:22 PM IST

IPL 2023: టీమిండియా మాజీ  సారథి విరాట్ కోహ్లీతో పాటు  నయా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఏకకాలంలో సెంచరీ చేస్తే  గంగూలీ మాత్రం ఒక్క గిల్ నే పొగిడాడని   కోహ్లీ ఫ్యాన్స్ మండిపడ్డారు. 

PREV
16
మీకు ఇంగ్లీషు రాకుంటే నన్నేం చేయమంటార్రా.. నేను క్లీయర్‌గా చెప్పా కదా :  కోహ్లీ ఫ్యాన్స్‌కు కౌంటరిచ్చిన దాదా

ఐపీఎల్ -16 లో భాగంగా  రెండ్రోజుల క్రితం ముగిసిన   బెంగళూరు - గుజరాత్ మ్యాచ్ లో  ఆర్సీబీ సూపర్  స్టార్   విరాట్ కోహ్లీతో పాటు  గుజరాత్  ఓపెనర్ శుభ్‌మన్ గిల్  లు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.  

26
Image credit: PTI

ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా ఈ ఇద్దరూ  ఐపీఎల్ లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు నమోదుచేశారు.  కోహ్లీ..  సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు గుజరాత్ పై  శతకం బాదగా, గిల్ కూడా  సన్ రైజర్స్ తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సెంచరీలు చేశాడు. 

36

అయితే ఈ సెంచరీల తర్వాత  టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు  సౌరవ్ గంగూలీ ట్వీట్ చేస్తూ.. ‘ఈ దేశం  ఎంత  టాలెంట్ ను ప్రొడ్యూస్ చేస్తుందో చూడండి. శుభ్‌మన్ గిల్.. వావ్..  టూ స్టన్నింగ్ నాక్స్ ఇన్  టూ హావ్స్..  ఐపీఎల్.. ఈ టోర్నీలో ఎలాంటి ప్రమాణాలు  ఉన్నాయనేదానికి ఇదే నిదర్శనం..’ అని పేర్కొన్నాడు. 

46

ఈ ట్వీట్ లో  దాదా.. గిల్ పేరును మాత్రమే మెన్షన్ చేసి  కోహ్లీ పేరును పట్టించుకోకపోవడం కోహ్లీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది.  గిల్ కు మాదిరే వీకే అని పెట్టినా తాము హ్యాపీగా ఫీలయ్యేవాళ్లం కదా..  కోహ్లీపై అంత వివక్ష ఎందుకు..? అని కారాలు మిరియాలు నూరారు. గంగూలీ ఇంకా  పాత కక్షలను  మనసులో పెట్టుకున్నాడని  కామెంట్స్ చేశారు. 

56

కాగా తాజాగా తనను ట్రోల్ చేసేవారికి దాదా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.  ఇదే ట్వీట్ కింద.. ‘జస్ట్ ఎ క్విక్ రిమైండర్. నేను చేసిన ఈ ట్వీట్ ను మీ ఇష్టానుసారం  అన్వయించుకుంటున్న వారికి నేను చెప్పేదేంటంటే ముందు ఇంగ్లీష్ ను అర్థం చేసుకోండి.  ఒకవేళ మీకు అర్థం చేసుకునే తెలివి లేకుంటే   ఎవరితో అయినా  చెప్పించుకోండి..’ అని రాసుకొచ్చాడు.  

66

గంగూలీ తన ఫస్ట్  ట్వీట్ లో.. ‘టూ స్టన్నింగ్ నాక్స్ ఇన్ టూ హావ్స్’అంటే ‘ఒకే ప్రత్యర్థిపై ఏకకాలంలో  చేసే అత్యుత్తమ ప్రదర్శన’ లేదా ‘రెండు సమాన  కాలాలలో ఒకే రకమైన ప్రదర్శన’ అని  అర్థం వస్తున్నది. దీని ప్రకారం..  గిల్, కోహ్లీలు ఒకే ప్రత్యర్థి (సన్ రైజర్స్) పై సెంచరీ చేయడమే గాక ఆదివారం ఒకే మ్యాచ్ లో  రెండు సెంచరీలు చేయడం గమనార్హం. దాదా ఇంగ్లీషులో అంత మ్యాజిక్ ఉంది మరి..!

Read more Photos on
click me!

Recommended Stories