ఫుల్లుగా తాగి, స్టేడియానికి వచ్చి దొరికిన క్రికెటర్లు వీరే... ఆండ్రూ ఫ్లింటాఫ్, సైమండ్స్‌తో పాటు...

Published : Mar 22, 2022, 01:59 PM IST

క్రికెట్‌ను జెంటిల్మెన్ గేమ్‌గా పిలుస్తారు. అయితే క్రికెట్‌లోనూ వివాదాలు కొత్తేమీ కాదు. క్రికెటర్లు మద్యపానం చేయకూడదనే రూల్ అయితే ఏమీ లేదు కానీ, తాగి క్రికెట్ ఫీల్డ్‌లో అడుగుపెట్టడం మాత్రం క్షమించరాని నేరంగా పరిగణిస్తారు. అయితే కొందరు క్రికెటర్లు, ఫుల్లుగా తాగి ఆడడానికి వస్తే, మరికొందరు స్టేడియంలోనే మందు కొట్టి వార్తల్లో నిలిచారు...  

PREV
112
ఫుల్లుగా తాగి, స్టేడియానికి వచ్చి దొరికిన క్రికెటర్లు వీరే... ఆండ్రూ ఫ్లింటాఫ్, సైమండ్స్‌తో పాటు...

హర్షల్ గిబ్స్: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీనేజ్ వయసులో ఫెవరెట్ క్రికెటర్ హర్షల్ గిబ్స్. ప్రస్తుతం సౌతాఫ్రికా క్రికెట్ కోచ్‌గా ఉన్న హర్షల్ గిబ్స్, అంతర్జాతీయ క్రికెట్‌లో 35 సెంచరీలతో 37.30 సగటుతో 14 వేలకు పైగా పరుగులు చేశాడు...

212

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 434 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది సౌతాఫ్రికా. ఈ మ్యాచ్‌లో వన్ డౌన్ ప్లేయర్‌గా వచ్చిన గిబ్స్ 111 బంతుల్లో 21 ఫోర్లు, 7 సిక్సర్లతో 175 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గిబ్స్‌కి వన్డేల్లో ఇదే అత్యుత్తమ స్కోరు. 

312

అయితే ఈ మ్యాచ్‌కి ముందు ఫుల్లుగా తాగి, స్టేడియానికి వచ్చాడట గిబ్స్. తాను బ్యాటింగ్‌కి వెళ్లేటప్పుడు కూడా ఏం జరుగుతుందో గ్రహించలేకపోయాడట గిబ్స్. ఈ విషయాన్ని స్వయంగా తన ఆటో బయోగ్రఫీ ‘టు ది పాయింట్’లో రాసుకొచ్చాడు హర్షల్ గిబ్స్...

412

ఆండ్రూ ఫ్లింటాఫ్: ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్, కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తన కెరీర్‌లో 7315 పరుగులు, 400 వికెట్లు పడగొట్టాడు. అయితే సౌతాఫ్రికాతో జరిగే టెస్టు మ్యాచ్‌లో ఫుల్లుగా తాగి బ్యాటింగ్‌కి వెళ్లాడట ఫ్లింటాఫ్... 

512

‘సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. తర్వాతి రోజు నేనే బ్యాటింగ్‌కి వెళ్లాలి. ఆ ప్రెజర్‌ని తట్టుకోవడానికి బార్‌కి వెళ్లి ఫుల్లుగా తాగేశా. అప్పుడు నా ఫ్రెండ్‌తో సెంచరీ చేస్తానని చెప్పా. అదే జోష్‌లో బ్యాటింగ్ చేసి టెస్టుల్లో నా రెండో సెంచరీ సాధించా... ’ అంటూ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు ఆండ్రూ ఫ్లింటాఫ్...

612

గ్యారీ సోబర్స్: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ గ్యారీ సోబర్స్, తన కెరీర్‌లో 93 టెస్టు మ్యాచులు ఆడి 8032 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 235 వికెట్లు పడగొట్టాడు...

712

లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో మద్యం మత్తులోనే బ్యాటింగ్‌కి వచ్చి 150 పరుగులు చేశాడు గ్యారీ సోబర్స్. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు గ్యారీ...

812

ఆండ్రూ సైమండ్స్: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్, వివాదాల కారణంగానే అనుకున్నంత సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. తన కెరీర్‌లో 6887 పరుగులు, 165 వికెట్లు తీసిన సైమండ్స్, 2005లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తప్పతాగి దొరికిపోయాడు...

912

‘వార్మప్ మొదలైనప్పుడు నేను టీమ్‌తోనే ఉన్నా. అయితే కొద్దిసేపటి తర్వాత వేరే ప్లేయర్లతో కలిసాను. వాళ్లు కొద్దిసేపు ప్రాక్టీస్ చేసి, డ్రింక్ చేయడం మొదలెట్టాడు. సైమండ్స్ వారితో కలిసి పడిపోయేదాకా మందుకొట్టాడు...’ అంటూ సైమండ్స్ ఆ సంఘటన గురించి ఓ సారి బయటపెట్టాడు...

1012

వసీం రాజా: వివాదాలకీ, పాకిస్తాన్‌ క్రికెటర్లకీ మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. పాక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన వసీం రాజా, తన కెరీర్‌లో 4 సెంచరీలతో 2800 పరుగులు చేశాడు...

1112

కరాచీలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న వసీం రాజా, స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్‌తో గొడవకు దిగాడు. బట్టలు ఇప్పేస్తానంటూ వారిని బెదిరించాడు...

1212

ఈ విషయంపై విచారణ చేసిన అధికారులకు షాకింగ్ విషయం తెలిసింది. ఆ సమయంలో వసీం రాజా తాగేసి ఉన్నాడని తేలింది. ఆ మ్యాచ్‌లో వసీం రాజా సెంచరీ చేయడం విశేషం. 

click me!

Recommended Stories