డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు వీళ్లే..

First Published Jun 2, 2023, 3:43 PM IST

WTC Finals 2023: ఈనెల  7 నుంచి లండన్ లోని ఓవల్ వేదికగా ఐసీసీ నిర్వహించే డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. ఈ నేపథ్యంలో  ఈ రెండేండ్ల కాలానికి అత్యధిక వికెట్లు  తీసిన వీరులెవరంటే..!

ఐసీసీ ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్  ఈనెల 7 నుంచి  11 వరకూ  ‘ది ఓవల్’ వేదికగా సాగనుంది.  ఈ నేపథ్యంలో  2021 - 2023 మధ్య కాలానికి అత్యధిక వికెట్లు తీసిన టాప్-10  బౌలర్లు ఎవరో ఇక్కడ చూద్దాం. 

జస్ప్రీత్ బుమ్రా : టీమిండియా పేస్ గుర్రం  జస్ప్రీత్ బుమ్రా  డబ్ల్యూటీసీ 2021-2023 కాలానికి గాను 10  టెస్టులు ఆడాడు. పది మ్యాచ్ లలో 19.76 సగటుతో  45 వికెట్లు పడగొట్టాడు. అయితే  గాయం కారణంగా  బుమ్రా తప్పుకోవడంతో అతడి వికెట్ల సంఖ్య తగ్గింది. 

జాక్ లీచ్ : ఇంగ్లాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్..  16 టెస్టులు ఆడి  48 వికెట్లు పడగొట్టాడు.  స్వదేశంతో పాటు పాకిస్తాన్ లో ఆడటం లీచ్ కు కలిసొచ్చింది. 

టిమ్ సౌథీ : న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ 13 టెస్టులలో 32.11 సగటుతో 50 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు  ఐదు వికెట్ల ఘనత సాధించడం గమనార్హం.

Image credit: Getty

మిచెల్ స్టార్క్ : ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. 16 టెస్టులు ఆడి 51 వికెట్లు తీశాడు.  గతేడాది స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన యాషెస్ సిరీస్ లో  స్టార్క్ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల్లాడింది. 

Image credit: PTI

పాట్ కమిన్స్ :  ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా  ఈ ఏడాది 15 టెస్టులు ఆడి 53 వికెట్లు పడగొట్టాడు. యాషెస్ తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టులలో కమిన్స్.. తన బౌలింగ్ లో  పదును చూపించాడు. 

ఓలి రాబిన్సన్ : ఇంగ్లాండ్ పేసర్ ఓలి రాబిన్సన్.. ఈ రెండేండ్ల కాలంలో  13 టెస్టులే ఆడి  53 వికెట్లు సొంతం చేసుకున్నాడు. రాబిన్సన్ గత రెండేండ్లలో ఇంగ్లాండ్ టెస్టు విజయాలలో కీలక భూమిక పోషిస్తున్నాడు. 

జేమ్స్ అండర్సన్ : ఇంగ్లాండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్  ఈ సీజన్ లో 15 టెస్టులు ఆడి  58 వికోట్లు పడగొట్టాడు. 40 ఏండ్లు దాటినా అండర్సన్ ఇంకా  యువ పేసర్లతో పోటీ పడుతూ  బౌలింగ్ లో రాణిస్తున్నాడు. 

రవిచంద్రన్ అశ్విన్ : టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ జాబితాలో టాప్ - 3లో ఉన్నాడు.  అశ్విన్.. 2021-2023లో 13 టెస్టులు ఆడి  61 వికెట్లు సాధించాడు.  

కగిసొ రబాడా : సౌతాఫ్రికా పేస్ సంచలనం కగిసొ రబాడా ఈ సీజన్ లో  19 టెస్టులు ఆడి ఏకంగా 67 వికెట్లు సాధించి  రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాపై ఈ ఏడాది ఆరంభంలో ఆడిన మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో రబాడా రఫ్ఫాడించాడు. 

నాథన్ లియాన్ : ఈ ఆసీస్ వెటరన్  ఆఫ్ స్పిన్నర్  డబ్ల్యూటీసీ  221- 2023  సైకిల్  లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో లియాన్.. 19 టెస్టులలో ఏకంగా 83 వికెట్లు పడగొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 

click me!