అతను చేసిందేమీ లేదు, క్రెడిట్ కొట్టేయడం తప్ప... మాజీ క్రికెటర్ శ్రీశాంత్ షాకింగ్ కామెంట్స్...

Published : Jul 27, 2022, 05:25 PM IST

శ్రీశాంత్... ఏం చేసినా అది వార్తే. కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమ్‌లోకి ఓ ఉప్పెనలా వచ్చిన శ్రీశాంత్, తన దూకుడుతో తక్కువ కాలంలో మంచి పాపులారిటీ, క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని, అంతే త్వరగా టీమ్‌ నుంచి బయటికి వెళ్లిపోయాడు...

PREV
110
అతను చేసిందేమీ లేదు, క్రెడిట్ కొట్టేయడం తప్ప...  మాజీ క్రికెటర్ శ్రీశాంత్ షాకింగ్ కామెంట్స్...
Dhoni-Sreesanth

తనపై పడిన స్పాట్ ఫిక్సింగ్ కేసు బ్యాన్ నుంచి బయటికి వచ్చేందుకు ఏడేళ్లు ఎదురుచూసిన శ్రీశాంత్, దేశవాళీ టోర్నీల్లో కమ్‌బ్యాక్ ఇచ్చి... ఐపీఎల్ ఆడాలని ఆశించాడు. అయితే రెండు సీజన్లలోనూ శ్రీశాంత్‌ని ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించేశాడు...

210

కొన్నిరోజుల క్రితం తాను టీమ్‌లో ఉండి ఉంటే విరాట్ కోహ్లీ టీమ్ మూడు వరల్డ్ కప్స్ గెలిచేదని వ్యాఖ్యలు చేసిన శ్రీశాంత్, తాజాగా భారత జట్టుకి మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా నియమించబడిన ప్యాడీ అప్టన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు..

310
S Sreesanth and Sachin Tendulkar

‘నాకు తెలిసి అప్టన్‌, అద్భుతాలేమీ చేయలేడు. ఒకవేళ టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిస్తే అది ఆటగాళ్ల పర్ఫామెన్స్ వల్ల, రాహుల్ భాయ్ (హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్) అనుభవం వల్ల అంతే...

410

అంతేకానీ మీరు మాట్లాడుతున్న ఆ అప్టన్, జట్టులో ఇసురంతైనా మార్పులు తీసుకురాలేడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడిన ప్రతీ ప్లేయర్ మెంటల్‌గా ఫిట్‌గానే ఉంటాడు. అతనికి కీలక టోర్నీల్లో ఎలా ఆడాలో అవగాహన ఉంటుంది...

510

అంతేతప్ప ఈ మెంటల్ కండీషనింగ్ కోచ్‌లు వచ్చి కండీషన్‌లో పెట్టేదేమీ ఉండదు. వన్డే వరల్డ్ కప్ 2011 విజయంలో గ్యారీ కిర్‌స్టన్ 99 శాతం పని చేస్తే, అప్టన్ 1 శాతం ఆయనకి అసిస్టెంట్‌గా చేశాడు...

610

Paddy Upton

అతను మళ్లీ రావడానికి రాహుల్ భాయ్‌. రాహుల్ భాయ్‌, ఇతన్ని బాగా వాడుకోగలడు ఎందుకంటే ఆయన మంచి యోగా టీచర్ కాబట్టి.. ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్...

710

ప్యాడీ అప్టన్‌పై శ్రీశాంత్ ఇలా కామెంట్ చేయడానికి కారణముంది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న కేరళ క్రికెటర్ శ్రీశాంత్, 2013 మే 16న అరెస్ట్ అయ్యాడు. అయితే అరెస్టుకి ముందే అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌తో అమర్యాదగా ప్రవర్తించి, జట్టు నుంచి ఇంటికి పంపబడినట్టు తన ఆటోబయోగ్రఫీలో చెప్పుకొచ్చాడు ప్యాడీ అప్టన్...

810

భారత క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో గొడవ వంటి సంఘటనలతో శ్రీశాంత్ షార్ట్ టెంపర్ బిహేవియర్ గురించి అప్పటికే చాలా పెద్ద చర్చ జరిగింది... ‘2013లో ఐపీఎల్ సీజన్ నడుస్తున్న టైమ్‌లో నేను రాజస్థాన్ రాయల్స్‌కి మెంటల్ కోచ్‌గా వ్యవహరించాను. ఎవరైనా శ్రీశాంత్ ఓ ఎమోషనల్ పర్సన్ అని, ప్రతీదానికి బాధపడతాడని చెబితే నేను నవ్వుతాను...

910

ఎందుకంటే అతను ఎమోషనల్‌గా వీక్ కాదు, తన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేని స్వభావం తనది. చాలాసార్లు ఇలాగే ఓవర్‌గా కోపం, అతి ఆవేశం చూపించేవాడు శ్రీశాంత్... అయితే టీమ్‌కి ఎంపిక చేయకపోవడంతో శ్రీశాంత్‌కి బాగా కోపం వచ్చింది. అందరి ముందు మమ్మల్ని బూతులు తిట్టాడు... అతని మెంటల్ కండీషన్ సరిగా లేదని నాకు అప్పుడే క్లారిటీ వచ్చేసింది.

1010

సీనియర్ క్రికెటర్ అని కూడా చూడకుండా తనని తిట్టడంతో షాకైన రాహుల్ ద్రావిడ్, అతన్ని టీమ్‌ నుంచి పక్కనబెట్టి, అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు ఇంటికి పంపించేశాడు...’ అంటూ తన బుక్ ‘ది బేర్ ఫూట్ కోచ్’ లో రాసుకొచ్చాడు ప్యాడీ అప్టన్...

click me!

Recommended Stories