టీమిండియాకి కావాల్సిన ఆల్‌రౌండర్ అతనే! 12 ఏళ్ల క్రితం ఎమ్మెస్ ధోనీ కామెంట్స్...

Published : Mar 11, 2022, 10:56 AM IST

టీమిండియా నయా సారథి రోహిత్ శర్మలాగే టీమిండియాలోకి వచ్చిన చాలా ఏళ్ల తర్వాత కీ ప్లేయర్‌గా మారాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. మొహాలీ టెస్టులో అటు బ్యాటుతో, ఇటు బాల్‌తో అద్భుతంగా రాణించిన జడ్డూ గురించి 12 ఏళ్ల క్రితమే కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడట ఎమ్మెస్ ధోనీ...

PREV
110
టీమిండియాకి కావాల్సిన ఆల్‌రౌండర్ అతనే! 12 ఏళ్ల క్రితం ఎమ్మెస్ ధోనీ కామెంట్స్...

2008 అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన విరాట్ కోహ్లీ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న రవీంద్ర జడేజా...  2008 ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున రాణించాడు...

210

ఆ తర్వాతి ఏడాది టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన రవీంద్ర జడేజా, స్పిన్ ఆల్‌రౌండర్‌గా మూడు ఫార్మాట్లలోనూ కీ ప్లేయర్‌గా మారాడు...

310

కెరీర్‌ ఆరంభంలో వరుసగా విఫలమవుతూ వచ్చిన రవీంద్ర జడేజాకి అనేక అవకాశాలు ఇచ్చాడు అప్పటి టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ...

410

బాల్‌తో, బ్యాటుతో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నా, టీమ్‌లో చోటు కల్పిస్తూ రవీంద్ర జడేజాని ప్రోత్సహిస్తూ వచ్చాడు అప్పటి టీమిండియా కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ...

510

ఓ ఇంటర్వ్యూలో ఎమ్మెస్ ధోనీని ఇంటర్వ్యూ చేసిన విక్రమ్ చంద్ర అనే జర్నలిస్ట్... ‘రవీంద్ర జడేజా వరుసగా విఫలమవుతున్నాడు, అతన్ని టీమ్‌లో నుంచి తప్పించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు? అయినా అతన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు?’ అని ప్రశ్నించాడు.

610

దానికి ఎమ్మెస్ ధోనీ... ‘మనం కొంచెం ఓపిక పట్టాలి. ఓ రోజు టీమిండియాకి కావాల్సిన ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఎదుగుతాడు...’ అంటూ సమాధానం ఇచ్చాడు...

710

తొలి రెండు సీజన్లు రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన రవీంద్ర జడేజా, ఆ తర్వాత కొచ్చి టస్కర్స్ కేరళ, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ వంటి జట్లకు ఆడాడు...

810

ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో భాగంగా రవీంద్ర జడేజాని ఏకంగా రూ.16 కోట్లకు రిటైన్ చేసుకుంది సీఎస్‌కే. వచ్చే సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా జడ్డూ నియమించబడతాడని టాక్ వినబడుతోంది. 

910

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్సీ ఆశిస్తున్నట్టు ప్రత్యేక్షంగానే కామెంట్లు చేసిన రవీంద్ర జడేజా, మొహాలీ టెస్టులో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

1010

మొహాలీ ఇన్నింగ్స్‌ కారణంగా టెస్టు ఆల్‌రౌండర్ల ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌కి దూసుకెళ్లిన జడ్డూ... ఐపీఎల్ 2022 సీజన్‌లో సీఎస్‌కేకి కీలక ప్లేయర్‌గా మారాడు.

Read more Photos on
click me!

Recommended Stories