ఇక అతడు రెస్ట్ తీసుకోవడం బెటర్.. టీమిండియా వికెట్ కీపర్ పై మదన్ లాల్ సీరియస్ కామెంట్స్

Published : Jan 09, 2022, 12:33 PM IST

Rishabh Pant-Madan Lal :  గతేడాది ప్రారంభంలో జరిగిన ఆసీస్ తో పాటు ఇంగ్లాండ్ తో స్వదేశంలో ముగిసిన టెస్టు సిరీస్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా యువ వికెట్ కీపర్ గత కొద్దికాలంగా పేలవ ఫామ్ తో విమర్శల పాలవుతున్నాడు. 

PREV
19
ఇక అతడు రెస్ట్ తీసుకోవడం బెటర్.. టీమిండియా వికెట్ కీపర్ పై మదన్ లాల్ సీరియస్ కామెంట్స్

గత కొద్దిరోజులుగా వరుసగా విఫలమవుతున్నటీమిండియా యువ వికెట్ కీపర్  రిషభ్ పంత్ పై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉన్నది. అనవసర షాట్లకు వెళ్లి ఔటవుతున్న అతడి ఆటతీరుపై  సీనియర్ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 

29

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రెండు టెస్టులలో రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా వాండరర్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కష్టాల్లో ఉండగా అతడు నిర్లక్ష్యపు షాట్ కు అవుటవడం  అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది. 

39

ఇదే విషయమై భారత  మాజీ క్రికెటర్ మదన్ లాల్ కూడా పంత్ పై ఫైర్ అయ్యాడు. అతడు కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించాడు.  పంత్ స్థానంలో వెటరన్ వికెట్ కీపర్  వృద్ధిమాన్ సాహాకు అవకాశమివ్వాలని అభిప్రాయపడ్డాడు. 

49

మదన్ లాల్ మాట్లాడుతూ... ‘అతడు (రిషభ్ పంత్) మ్యాచ్ విన్నర్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఒక కీలక ఆటగాడు ఇలా ఆడటమనేది సరికాదు.. 

59

అతడు కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే మంచిది. నువ్వు నీ కోసం కాకుండా జట్టు కోసం ఆడాలి.  నా దృష్టిలో పంత్ కు బదులు వృద్ధిమాన్ సాహాకు అవకాశమివ్వడం బెటర్.

69

పంత్ కన్నా అతడు బాగా బ్యాటింగ్ చేయగలడు. అంతేగాక మంచి వికెట్ కీపర్ కూడా...’ అని మదన్ లాల్ అభిప్రాయపడ్డాడు. 

79

పంత్ ఆటతీరుపై సునీల్ గవాస్కర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాధ్యతగా ఆడాల్సింది పోయి చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్న పంత్ ను చూస్తే ఏమనాలో మాటలు రావడం లేదని సన్నీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. వరుసగా వైఫల్యం చెందుతుండటంతో పంత్ ను మూడో టెస్టుకు ఎంపిక చేస్తారా..? లేదా..? అనేది అనుమానంగా మారింది.

89

గతేడాది ఆసీస్ తో పాటు ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరిగిన టెస్టు  సిరీస్ లలో ఇరగదీసిన పంత్.. ఆ తర్వాత పేలవ ఆటతీరుతో విమర్శల పాలవుతున్నాడు.

99

గడిచిన 13 ఇన్నింగ్సులలో పంత్ చేసిన మొత్తం పరుగులు 250 కి దాటలేదు. ఇందులో ఒక్కటంటే ఒక్కటే హాఫ్ సెంచరీ ఉంది. ఇక చివరి ఏడు టెస్టు మ్యాచులలోని ఆరు ఇన్నింగ్సులలో అతడు సింగిల్ డిజిట్ కే నిష్క్రమించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేప్ టౌన్ టెస్టుకు పంత్ ఆడేది డౌటే అని  వాదనలు వినిపిస్తున్నాయి.  

Read more Photos on
click me!

Recommended Stories