జెడ్ సెక్యూరిటీ ఇస్తేనే, ఇండియాకి వస్తాం! వన్డే వరల్డ్ కప్ కోసం భారత్‌లో అడుగుపెట్టేందుకు పాకిస్తాన్ పట్టు...

Published : Aug 04, 2023, 10:21 AM IST

ఆసియా కప్ 2023 టోర్నీ కోసం పాకిస్తాన్‌లో అడుగుపెట్టేందుకు నిరాకరించింది టీమిండియా. దీంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం భారత్‌లో అడుగుపెట్టేందుకు హై డ్రామా క్రియేట్ చేస్తోంది పాకిస్తాన్...

PREV
16
జెడ్ సెక్యూరిటీ ఇస్తేనే, ఇండియాకి వస్తాం! వన్డే వరల్డ్ కప్ కోసం భారత్‌లో అడుగుపెట్టేందుకు పాకిస్తాన్ పట్టు...

2016 టీ20 వరల్డ్ కప్ కోసం చివరిగా ఇండియాకి వచ్చింది పాకిస్తాన్. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఇండియాలో జరగాల్సింది కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా యూఏఈలో జరిగింది..

26
Pakistan Cricket Team

పాకిస్తాన్ జట్టుకి ఇండియాలో పర్యటిస్తే భద్రత ఉంటుందా? అనే విషయం తేల్చేందుకు ఓ కమిటీని నియమించి, భారత పర్యటనకు పంపింది. ఈ కమిటీలో భారత్‌లో పర్యటించి, అంతా బాగానే ఉందనే రివ్యూ ఇచ్చింది కూడా...

36
Pakistan Cricket

అయితే 2016 టీ20 వరల్డ్ కప్ సమయంలో పాకిస్తాన్ జట్టుకి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారో, అదే విధమైన భద్రతా ఏర్పాట్లు ప్రస్తుత పాక్ టీమ్‌కి కల్పించాలని ఐసీసీని, బీసీసీఐని కోరింది పీసీబీ.. అంటే దాదాపు జెడ్ సెక్యూరిటీ ఉంటేనే, ఇండియాలో అడుగుపెడతామని తేల్చి చెబుతోంది పాకిస్తాన్ టీమ్.. 

46

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కత్తాల్లో మ్యాచులు ఆడుతోంది పాకిస్తాన్... గ్రూప్ స్టేజీలో టాప్ 4లో నిలిస్తే ముంబై, కోల్‌కత్తాల్లో సెమీ ఫైనల్ మ్యాచులు జరుగుతాయి..
 

56

అయితే మహారాష్ట్రలో పర్యటించేందుకు పాకిస్తాన్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరితే, పొజిషన్‌తో సంబంధం లేకుండా కోల్‌కత్తాలో సెమీస్ ఆడుతుంది. అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది..

66


అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అదే రోజు దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతుండడంతో అక్టోబర్ 14కి ఈ మ్యాచ్ రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది...

click me!

Recommended Stories