ధోనీకి నాకూ ఎలాంటి గొడవలు లేవు, అతను నాకు మంచి ఫ్రెండ్ కూడా... హర్భజన్ సింగ్ కామెంట్...

First Published Mar 20, 2023, 1:42 PM IST

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చి, మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమ్‌లో చోటు కోల్పోయిన సీనియర్లలో హర్భజన్ సింగ్ కూడా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 700లకు పైగా వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, వీడ్కోలు మ్యాచ్ లేకుండానే రిటైర్మెంట్ తీసుకున్నాడు...

Dhoni-Harbhajan Singh

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగార్కర్, యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్ వంటి సీనియర్లు టీమ్‌లో చోటు కోల్పోయి... కొన్నేళ్లకు నిరాశగా రిటైర్మెంట్ తీసుకున్నారు...

2012లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్ పఠాన్, 2021లో రిటైర్మెంట్ తీసుకున్నాడు. 2021 డిసెంబర్‌లో రిటైర్మెంట్ ఇచ్చిన హర్భజన్ సింగ్ కూడా తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2016లో ఆడేశాడు...
 

Latest Videos


‘టెస్టుల్లో 400 వికెట్లు తీసిన బౌలర్‌కి టీమ్‌లో చోటు దక్కడం లేదు. ఎందుకు డ్రాప్ చేయాల్సి వచ్చిందో కూడా చెప్పడం లేదు. నా బుర్రలో ఎన్నో ఆలోచనలు రేగుతున్నాయి. ఎన్నోసార్లు నన్ను ఎందుకు టీమ్ నుంచి తీసేశారో చెప్పాల్సిందిగా సెలక్టర్లను అడిగాను. నాకు సరైన సమాధానం మాత్రం దొరకలేదు...’ అంటూ రిటైర్మెంట్ సమయంలో కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...

ధోనీ కెప్టెన్సీలో టీమ్ నుంచి తప్పుకోవడంతో ఈ కామెంట్లు, అతని గురించేనని అనుకున్నారంతా. ధోనీకి, యువరాజ్‌కి మధ్య సంబంధాలు చెడిపోయినట్టే, హర్భజన్ సింగ్‌కి, మాహీకి మధ్య విభేదాలు వచ్చి ఉంటాయని అనుకున్నారంతా... 

‘ఎంఎస్ గురించి నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అతను నాకు ఎప్పుడూ మంచి స్నేహితుడే. నేను చెప్పింది బీసీసీఐ సర్కార్ గురించి... బీసీసీఐని సర్కార్ అని పిలుస్తాను. సెలక్టర్లు వాళ్ల పనికి సరిగ్గా న్యాయం చేయలేకపోయారు...

టీమ్‌లో సీనియర్ల పర్ఫామెన్స్ కంటే వాళ్ల వయసునే చూశారు. ధోనీకి నాకు ఎలాంటి సమస్య లేదు. మేం ఇద్దరం కలిసి ఎన్నో మ్యాచులు ఆడాం. ఇప్పటికీ అతను నాకు చాలా మంచి ఆత్మీయుడే. అతను తన లైఫ్‌లో బిజీ అయిపోయాడు. నేను నా లైఫ్‌లో బిజీ అయిపోయాను..

మేం చాలా తక్కువ సార్లు కలుస్తున్నాం. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవా లేదు. నాకు ధోనీపైన ఎలాంటి కోపం లేదు. నాకు తెలిసి ధోనీ, నా ఆస్తులేవీ లాక్కోలేదు.. కానీ నాకు అతని ఆస్తులపై ఆశ ఉంది. ముఖ్యంగా అతని ఫామ్ హౌజ్ అంటే చాలా ఇష్టం.. ’ అని చెబుతూ నవ్వేశాడు హర్భజన్ సింగ్...

ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో ధోనీ ఆడిన ఓ చిన్న ఇన్నింగ్స్ గురించి సోషల్ మీడియాలో చాలా పెద్ద జరిగింది. ‘40 ప్లస్ వయసులోనూ ధోనీ ఇరగదీశాడని’ అభిమానులు మెచ్చుకున్నారు. అయితే హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ మాత్రం భిన్నంగా స్పందించారు. ‘కొందరికి వయసు కేవలం నెంబర్ మాత్రమే. మరికొందరికి మాత్రం టీమ్‌లోకి రావడానికి అడ్డంకి’ అంటూ కామెంట్ చేశారు భజ్జీ, ఇర్ఫాన్.. 

click me!