LLC: సారథులుగా ఇర్ఫాన్, భజ్జీ.. లెజెండ్స్ లీగ్ లో ఆసక్తికర అప్డేట్స్

First Published Sep 2, 2022, 7:21 PM IST

Legends League Cricket: సెప్టెంబర్ 16 నుంచి  ప్రారంభం కాబోతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో మిగిలిన రెండు జట్లకు కెప్టెన్లు ఖరారయ్యారు. టీమిండియా దిగ్గజ బౌలర్లైన భజ్జీ, ఇర్ఫాన్ లు.. 
 

2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని సభ్యులుగా  ఉన్న నలుగురు భారత మాజీ క్రికెటర్లు మళ్లీ క్రీజులో అడుగుపెట్టనున్నారు.  భారత్ కు తొలి టీ20 ప్రపంచకప్ అందించిన జట్టులో కీలక సభ్యులుగా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ లు మళ్లీ తమ పాత రోజుల్లోకి వెళ్లనున్నారు. 

Image credit: Getty

ఈనెల 16 నుంచి ప్రారంభం కాబోయే లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సీ) రెండో సీజన్ దీనికి వేదిక కాబోతున్నది. 22 రోజుల పాటు (అక్టోబర్ 8 వరకు)  సాగే ఈ మెగా టోర్నీకి సర్వం సిద్ధమైంది.  నాలుగు ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్న ఈ సీజన్ లో నాలుగు జట్లకు సారథులు ఖరారయ్యారు. 
 

గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్ లకు ఇప్పటికే సారథులు ప్రకటించిన విషయం తెలిసిందే. గుజరాత్ కు వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్ కాగా.. ఇండియా క్యాపిటల్స్ కు గౌతం గంభీర్ సారథిగా వ్యవహరించనున్నాడు. 
 

Harbhajan Singh and Irfan Pathan

ఇక మణిపాల్ టైగర్స్ జట్టుకు  టర్బోనేటర్ హర్భజన్ సింగ్  కెప్టెన్ గా నియమితుడయ్యాడు.  భిల్వారా కింగ్ టీమ్ కు  ఇర్ఫాన్ పఠాన్ నాయకుడిగా వ్యవహరిస్తాడు.  ఈ ఇద్దరూ కలిసి దాదాపు దశాబ్దం పాటు భారత జట్టుకు సేవలందించారు.  లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో తమను సారథులుగా చేసినందుకు భజ్జీ, ఇర్ఫాన్ లు తమ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. 
 

ప్టెంబర్ 16 నుంచి ఎల్ఎల్సీ రెండో సీజన్ ప్రారంభం కానున్నది.  ఈ సీజన్ లో భాగంగానే తొలి మ్యాచ్ ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య జరుగనుంది. భారత్ కు స్వతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బీసీసీఐ ఈ మ్యాచ్ ను నిర్వహిస్తున్నది. భారత జట్టుకు  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. వరల్డ్ జెయింట్స్ కు ఇయాన్ మోర్గాన్ సారథులుగా ఉన్నారు. 

Image credit: LLCFacebook

టీ20 ఫార్మాట్ లో జరుగబోయే ఈ టోర్నీలో నాలుగు జట్లు పాల్గొంటాయి. లక్నో, న్యూఢిల్లీ, జోధ్‌పూర్, కటక్, కోల్కతాలలో మ్యాచ్ లు జరుగుతాయి. సెప్టెంబర్ 16న మొదలయ్యే ఈ  టోర్నీ.. అక్టోబర్ 8న ముగియనుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ఈ మ్యాచ్ లను వీక్షించొచ్చు. 

click me!