ఆస్ట్రేలియా పిచ్‌లపై బ్యాటింగ్ చేయాలంటే... బాక్సింగ్ డే టెస్టుకి ముందు టెండూల్కర్ సూచనలు...

First Published Dec 23, 2020, 5:56 PM IST

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ప్లేయర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ... భారత క్రికెట్ లెజెండ్, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ భారత జట్టుకు ఇక్కడి నుంచే సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వీడియో సందేశాల ద్వారా స్టీవ్ స్మిత్‌ను ఎలా అవుట్ చేయాలో చెప్పిన సచిన్ టెండూల్కర్, ఇప్పుడు ఆస్ట్రేలియా పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలో భారత బ్యాట్స్‌మెన్‌ను సూచించారు.

మొదటి టెస్టులో ఊహించని పరాభవం తర్వాత టీమిండియా ఒత్తిడిలోకి వెళ్లిందని చెప్పిన ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్... ఫస్టు టెస్టులో బ్యాట్స్‌మెన్ చేసిన తప్పేంటో వివరించాడు.
undefined
‘మొదటి ఇన్నింగ్స్‌లో మనం బాగానే బ్యాటింగ్ చేశాడు... విరాట్ కోహ్లీతో పాటు పూజారా కూడా చాలా మంచి టెక్నిక్‌తో ఓపిగ్గా బ్యాటింగ్ చేశారు...
undefined
అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మనవాళ్లు సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయారు, టైమింగ్ పూర్తిగా మిస్ అయినట్టు స్పష్టంగా కనిపించింది...
undefined
ఆడిలైడ్‌లో బంతి పూర్తిగా తిరగడం లేదు, చాలా కొద్దిగా మాత్రమే స్పింగ్ ఉంది... అయినా మనవాళ్లు తడబడ్డారు. సాధారణంగా బ్యాట్స్‌మెన్ స్కోరు చేసినప్పుడు ఎన్ని సార్లు బీట్ అయ్యాడనే విషయాన్ని పట్టంచుకోం...
undefined
అదే బ్యాట్స్‌మెన్... బ్యాట్ అంచుకు తగిలి క్యాచ్ ఇస్తే మాత్రం అన్ని విషయాలు పరిగణనలోకి వస్తాయి... ఓ చిన్నమార్పు కావాల్సిన పరుగులు తెచ్చి ఇస్తుంది...
undefined
విదేశీ పిచ్‌లపై ఆడాలంటే ఫాస్ట్ బౌలర్లకు ఎదురుగా నిలబడి బ్యాటింగ్ చేయాలి, అదే చాలా ముఖ్యం... ఆడాలా? వదిలేయాలా? అనే ఆలోచన సరికాదు...
undefined
హాఫ్ మైండ్‌తో సరైన ఫుట్‌వర్క్ లేకపోతే బౌలర్లు చెలరేగిపోతారు... మూడో ఇన్నింగ్స్‌లో జరిగింది ఇదే... ఫుట్‌వర్క్ కరెక్టుగా ఉంటే, ఎలాంటి బౌలర్ అయినా వికెట్ తీయలేడు...
undefined
ఆస్ట్రేలియా బౌలర్లు ఎక్కువగా ఆఫ్ స్టంఫ్‌కి దగ్గరగా బంతులు వేస్తున్నారు... ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆఫ్ స్టంఫ్‌కి అవతల బౌలింగ్ చేశారు... అంటే వికెట్లు పడకపోయేసరికి వారి వ్యూహం మారింది...
undefined
పృథ్వీషా అవుటైన తర్వాత వచ్చిన బుమ్రా... చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు.. అతని బ్యాటింగ్‌కి టీమిండియా కూడా చక్కగా స్పందించింది..
undefined
ఆ తర్వాతి రోజు ఫుట్‌వర్క్ లోపం కారణంగా టీమిండియా ఫెయిల్ అయ్యింది... ఫ్రంట్ ఫుట్‌పై ఆడుతున్నప్పుడు పూర్తి కాన్ఫిడెన్స్‌తో బంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది...’ అంటూ మెల్‌బోర్న్ టెస్టుకి ముందు అవసరమైన సూచనలు చేశారు సచిన్ టెండూల్కర్.
undefined
విరాట్ కోహ్లీ లేకపోయినా జట్టును నడిపించడానికి అవసరమైన టెక్నిక్, తెలివి తేటలు అజింకా రహానే దగ్గర కావాల్సినన్ని ఉన్నాయని చెప్పిన సచిన్ టెండూల్కర్, బాక్సింగ్ డే టెస్టులో అతని కెప్టెన్సీ చూసేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పాడు.
undefined
click me!