టార్గెట్ బట్లర్.. మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన గుజరాత్.. ఆరెంజ్ క్యాప్ బ్యాటర్ ను ఆడనివ్వబోమని వ్యాఖ్యలు

Published : May 24, 2022, 02:52 PM ISTUpdated : May 24, 2022, 02:53 PM IST

IPL 2022 Playoffs: ఐపీఎల్ లో మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ మొదలుకానున్నాయి. నేటి రాత్రి గుజరాత్ టైటాన్స్.. రాజస్తాన్ రాయల్స్ మధ్య  తొలి క్వాలిఫైయర్ జరగాల్సి ఉంది. 

PREV
18
టార్గెట్ బట్లర్.. మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన గుజరాత్.. ఆరెంజ్ క్యాప్ బ్యాటర్ ను ఆడనివ్వబోమని వ్యాఖ్యలు

ఈ సీజన్ లో  అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్న రెండు జట్లు   గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్. ఈ రెండు జట్లు నేడు కోల్కతా  లోని ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి క్వాలిఫైయర్ ఆడనున్నాయి.  

28

రాజస్తాన్ రాయల్స్ లో  ఓపెనర్  జోస్ బట్లర్ ఆ జట్టుకు ప్రధాన బలం.  లీగ్ దశలో అతడు చెలరేగిన  ప్రతి మ్యాచ్ లో  రాజస్తాన్ గెలిచింది. నెమ్మదిగా ఆరంభించి ఆ తర్వాత వీర విధ్వంసం సృష్టిస్తున్న బట్లర్ ను త్వరగా ఔట్ చేయకుంటే  నేటి మ్యాచ్ లో గుజరాత్ కు కష్టాలు తప్పవు. 

38

ఈ నేపథ్యంలో గుజరాత్ కూడా అతడినే టార్గెట్ చేసింది. బట్లర్, గిట్లర్ జాన్తా నై అంటూ మైండ్ గేమ్ కు దిగింది. బట్లర్ ను అడ్డుకునేందుకు తమ ప్లాన్లు తమకు ఉన్నాయని  చెప్పుకొచ్చింది. ఈ మేరకు  గుజరాత్ కీలక ఆటగాళ్లైన మహ్మద్ షమీ, రాహుల్ తెవాటియా లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

48

షమీ మాట్లాడుతూ.. ‘ఒక ఆటగాడిగా.. బౌలర్ గా మన మీద మనకు నమ్మకముండాలి. అవతలి వ్యక్తి ఎవరు..? అతడు ఎన్ని సెంచరీలు చేశాడు..? ఎన్ని పరుగులు చేశాడు..? ఇవన్నీ నేను పట్టించుకోను. పేర్లను చూసి ఎప్పుడూ భయపడకూడదు. 

58

అవతలి వైపు బ్యాటర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడని..  అతడు  షాట్లు ఆడతాడని మనమెప్పుడూ ఆలోచించకూడదు. ప్రతి ఒక్కరిలో బలహీనత ఉంటుంది. బట్లర్ జోరుకు అడ్డుకట్ట ఎలా వేయాలో మాకు తెలుసు. ఆ మేరకు మా ప్రణాళికలు మాకున్నాయి..’  అని తెలిపాడు. 

68

ఇక బట్లర్ ఆటపై  గుజరాత్ ఫినిషర్ రాహుల్ తెవాటియా స్పందిస్తూ.. ‘బట్లర్ ఆఫ్ ఫీల్డ్ లో ఎంత కామ్ గా ఉంటాడో ఆన్ ఫీల్డ్ లో అంత దూకుడుగా ఉంటాడు. ప్రస్తుతానికి ఆరెంజ్  క్యాప్ అతడి దగ్గరే ఉంది. అది బట్లర్ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాను.

78

కానీ బట్లర్ మా జట్టు మీద పరుగులు  చేయకూడదు. ఒకసారి కుదురుకున్నాడంటే  బట్లర్ ను ఔట్  చేయడం చాలా కష్టం. ఈ సీజన్ లో అతడు ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం..’ అని అన్నాడు. 

88

ఈ సీజన్ లో బట్లర్ ఆడిన 14 మ్యాచ్‌ల్లో 48.38 సగటుతో 146.96 స్ట్రయిక్‌ రేట్‌తో 629 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.   నేటి మ్యాచ్ లో కూడా రాజస్తాన్ అతడి మీదే ఆశలు పెట్టుకుంది. 

click me!

Recommended Stories