ఇంకెన్నాళ్లు ఇలా, కాస్త ఎదుగు! విరాట్ కోహ్లీని ట్రోల్ చేసిన జర్నలిస్ట్‌కి షాక్ ఇచ్చిన పాక్ బ్యాటర్...

First Published Jan 18, 2023, 3:58 PM IST

కాస్త గ్యాప్ తర్వాత ‘బాస్ ఈజ్ బ్యాక్’ అన్నట్టు క్రికెట్ బాక్సాఫీస్‌ని షేక్ ఆడిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌పై సెంచరీతో మూడేళ్ల బ్రేక్‌ని బద్ధలు కొట్టిన విరాట్ కోహ్లీ... వన్డేల్లో సూపర్ ఫామ్‌ని అందుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో సెంచరీ అందుకున్న విరాట్, శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు చేశాడు...

Image credit: KCA

నాలుగు వన్డేల్లో మూడు సెంచరీలు అందుకున్న విరాట్ కోహ్లీ, ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ 4లోకి ఎంట్రీ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ బీభత్సమైన ఫామ్ కారణంగా రెండేళ్లుగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న  బాబర్ ఆజమ్‌, త్వరలో ఆ ప్లేస్ కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు...
 

Image credit: KCA

శ్రీలంకతో సిరీస్‌లో ఆడినట్టుగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విరాట్ కోహ్లీ చెలరేగితే బాబర్ ఆజమ్ టాప్ ప్లేస్‌ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. విరాట్ తిరిగి ఫామ్‌లోకి రావడం బాబర్ ఆజమ్, పాక్ క్రికెట్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు...
 

అందుకే విరాట్ కోహ్లీని ట్రోల్ చేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు పాక్ జనాలు. ఫరీద్ ఖాన్ అనే పాక్ జర్నలిస్ట్, విరాట్ కోహ్లీపై ట్రోల్ చేస్తూ వేసిన పోస్ట్, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది...

‘ప్రెషర్ లేకపోతే విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడతాడు. ఇప్పటికే సిరీస్ గెలిచేశారు, ఈ మ్యాచ్‌లో ఎలా ఆడినా చెల్లుతుంది. అందుకే ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఇలాంటి మ్యాచుల్లో ఫామ్‌ తిరిగి అందుకోవడం చాలా ఈజీ.. టెస్టు క్రికెట్‌లో కోహ్లీ బాగా ఆడడం కావాలి..’ అంటూ ట్వీట్ చేశాడు ఫరీద్ ఖాన్...
 

Image credit: PTI

దీనికి పాక్ క్రికెటర్ సోహైల్ మక్సూద్ స్పందించాడు. ‘నువ్వు నిజమే చెబుతున్నావా? అతనొక్కడే ప్రెషర్ లేకపోతే బాగా ఆడగలడా? రెండు తప్పులు చేస్తే ఒకటి కరెక్ట్ అయిపోదు... కాస్త ఎదుగు...’ అంటూ కామెంట్ చేశాడు సోహెబ్ మక్సూద్...

Image credit: PTI

పరోక్షంగా బాబర్ ఆజమ్ గురించే సోహెబ్ ఈ విధంగా స్పందించాడో అందరికీ అర్థం అవుతోంది. దీనికి ఫరీద్ ఖాన్ స్పందించాడు. ‘సోహెబ్ బాయ్... ఇలాంటి పరిస్థితుల్లో ఫామ్‌లోకి రావడం వల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. ఆసియా కప్‌లో ఆఫ్ఘాన్‌పై సెంచరీ చేశాడు, అప్పటికే ఇండియా టోర్నీలో ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై సిరీస్ ఓడిపోయాక సెంచరీ చేశాడు...’ అంటూ కామెంట్లు చేశాడు ఫరీద్ ఖాన్...

‘విరాట్ కోహ్లీ పరుగులు చేయనప్పుడు చేయడం లేదని ఏడ్చారు. ఇప్పుడు అతను ఏ దేశంలో, ఏ పిచ్ మీద సెంచరీలు చేయలేదో చెప్పు... వాళ్లు బాబర్ ఆజమ్‌ని ట్రోల్ చేసినప్పుడు, వాటన్నింటినీ అతను పట్టించుకుంటాడా?’ అంటూ ఫరీద్‌కి రిప్లై ఇచ్చాడు  సోహెబ్ మక్సూద్.. 

Image credit: PTI

సోహెబ్ మక్సూద్ రిప్లైకి ఫరీద్ ఖాన్ అంగీకరిస్తున్నట్టు సమాధానం ఇచ్చాడు. ‘సోహెబ్ బాయ్ ఒప్పుకుంటున్నా. అయితే విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఫామ్‌లోకి రావాలి. ఊరికనే క్రికెటర్ ఆఫ్ ది డికేట్ అయిపోడు. అలాగని బాబర్‌ని తక్కువ పట్టకండి. అతను మనకి గర్వకారణం. మేమందరం బాబర్‌ని ప్రేమిస్తున్నాం..’ అంటూ రిప్లై ఇచ్చాడు ఫరీద్. ఈ చర్చ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. 

click me!