IPL 2025, IPL
IPL 2025 Retention Deadline Free Live Streaming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలకు రిటెన్షన్లను ఫైనల్ చేసే సమయం వచ్చింది. ఐపీఎల్ రిటెన్షన్లకు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటన చేస్తూ అక్టోబర్ 31 (గురువారం) లోగా తమ రిటెన్షన్ల లిస్టును సమర్పించాలని ఫ్రాంఛైజీలకు గడువు విధించింది.
Rohit Sharma, Virat Kohli, IPL 2025
గురువారం లోపు అన్ని జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేస్తాయి. జట్లు తమ కోర్ స్క్వాడ్‌లో ఏ ఆటగాళ్లను రిటైన్ చేయాలనే దానిపై నిర్ణయం ప్రకటిస్తాయి. ఈ ఏడాది ఐపీఎల్ జట్లు గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి దిగ్గజ ఆటగాళ్లపై అందరి చూపు ఉంది.
ఐపీఎల్ 2025 రిటెన్షన్ నియమాలు ఏమిటి?
ఐపీఎల్ జట్లు గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను ఉంచుకోవచ్చు. అంటే మొత్తంగా జట్లు ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే జట్టుతో ఉంచుకోవడానికి అనుమతించబడతాయి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా మూడు క్యాప్డ్ ప్లేయర్లకు రిటెన్షన్ ప్రైస్ స్లాబ్‌లను రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లుగా నిర్ణయించింది. రెండు అదనపు క్యాప్డ్ ప్లేయర్‌లకు రూ. 18 కోట్లు, రూ. 14 కోట్ల రిటెన్షన్ ఆప్షన్‌లు ఇచ్చాయి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లకు ఒక్కొక్కరి ధర రూ.4 కోట్లుగా నిర్ణయించారు.
Rishabh Pant, Pant, Axar Patel, David Warner, DC, IPL 2025
ఐపీఎల్ 2025 రిటెన్షన్ గడువు ఎప్పుడు?
ఐపీఎల్ 2025 నిలుపుదల గడువు గురువారం (అక్టోబర్ 31, 2024) వరకు సెట్ చేశారు. ఈ తేదిలోపు మొత్తం పది ఫ్రాంచైజీలు ఐపీఎల్ మెగా వేలానికి ముందు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను వెల్లడిస్తాయి. నవంబర్ చివరి వారంలో మెగా వేలం జరిగే అవకాశం ఉంది.
నిలుపుదల గడువు గురువారం (అక్టోబర్ 31) భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు సెట్ చేశారు. ఈ సమయానికి అన్ని జట్లు తమ రిటైన్, విడుదలైన ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు సమర్పించాలి.
ఐపీఎల్ 2025 రిటెన్షన్ షోను ఆన్‌లైన్‌లో, టీవీలో ఎలా చూడాలి?
ఐపీఎల్ రిటెన్షన్ స్పెషల్ షో అక్టోబర్ 31న సాయంత్రం 4:30 గంటలకు JioCinemaలో ఉచితంగా ప్రసారం కానుంది. టెలివిజన్ వీక్షకుల కోసం ఈ కార్యక్రమం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో కూడా ప్రసారం చేయనున్నారు.
Dinesh Karthik
ఐపీఎల్ 2025 రిటెన్షన్ స్లాబ్‌లు
క్యాప్డ్ ప్లేయర్‌ల రిటెన్షన్ స్లాబ్‌లు క్రింది విధంగా ఉన్నాయి:
ప్లేయర్ 1: రూ. 18 కోట్లు
ప్లేయర్ 2: రూ. 14 కోట్లు
ప్లేయర్ 3: రూ. 11 కోట్లు
ప్లేయర్ 4: రూ. 9 కోట్లు
ప్లేయర్ 5: రూ. 7 కోట్లు
అన్ క్యాప్డ్ ప్లేయర్ : రూ.4 కోట్లు
ఐపీఎల్ 2025 రిటెన్షన్ రూల్స్
జట్లు 6 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోగలవు.
ఫ్రాంచైజీ కనీసం 5 క్యాప్డ్ ప్లేయర్‌లను జట్టుతోనే అంటిపెట్టుకోగలదు.
అన్‌క్యాప్డ్ ప్లేయర్లు లిస్టులో అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నవారు ఉంటారు.
రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితాను 31 అక్టోబర్ 2024లోపు సమర్పించాలి.
Virat Kohli, RohitSharma, MS dhoni, David Warner
ఐపీఎల్ 2025 జట్లు
CSK: చెన్నై సూపర్ కింగ్స్
DC: ఢిల్లీ క్యాపిటల్స్
PBKS: పంజాబ్ కింగ్స్
KKR: కోల్‌కతా నైట్ రైడర్స్
RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్
GT: గుజరాత్ టైటాన్స్
MI: ముంబై ఇండియన్స్
RR: రాజస్థాన్ రాయల్స్
LSG: లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్ 2025 వేలం
ఐపీఎల్ 2025 వేలం డిసెంబర్ 2024లో నిర్వహించే అవకాశముంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. వేలం కోసం వేదిక వివరాలు నవంబర్ ప్రకటించనున్నారు. ఇప్పుడు ప్రతి జట్టు తమ ఆటగాళ్ల కోసం వేలం వేయడానికి 120 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కలిగి ఉంటుంది. వేలం పూర్తయిన తర్వాత ఆటగాళ్ల జాబితా బీసీసీఐకి అందిస్తారు.