ధోనీని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారన్న ముషారఫ్... పాక్ అధ్యక్షుడికి గంగూలీ ఇచ్చిన ఆన్సర్ వింటే...

Published : Dec 16, 2021, 04:26 PM IST

భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రస్తుతం తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం... గంగూలీతో పాటు బీసీసీఐ సెక్రటరీ జై షాపై కూడా తీవ్రమైన ట్రోలింగ్ రావడానికి కారణమైంది...

PREV
113
ధోనీని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారన్న ముషారఫ్... పాక్ అధ్యక్షుడికి గంగూలీ ఇచ్చిన ఆన్సర్ వింటే...

విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోకూడదని స్వయంగా తానే బ్రతిమిలాడనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కామెంట్ చేయడం... తనను ఎవ్వరూ అడ్డుకోలేదని కోహ్లీ చెప్పడంతో దుమారం రేగింది...

213

విరాట్ అబద్ధం చెప్పాడా? లేక కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంతో వస్తున్న ట్రోలింగ్‌ను అడ్డుకోవడానికి సౌరవ్ గంగూలీ మాటవరుసగా అలా చెప్పుకోచ్చాడా? అనేది తెలియాల్సి ఉంది...

313

భారత జట్టుకి అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీని ఎదురైన పరాభవాన్ని మాత్రం ఆయన ఫ్యాన్స్ సహించలేకపోతున్నారు...

413

ఇదే సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ కూడా బీసీసీఐ నిర్ణయాల కారణంగా మాహీ అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు...

513

అయితే విరాట్ కోహ్లీని ప్రోత్సహించి, కెప్టెన్‌గా నియామకం అవ్వడానికి ప్రధాన కారణమైన మహేంద్ర సింగ్ ధోనీని అంతర్జాతీయ క్రికెట్‌కి పరిచయం చేసింది సౌరవ్ గంగూలీయే అని ఫ్యాన్స్ మరిచిపోతున్నారని అంటున్నారు దాదా ఫ్యాన్స్...

613

2003-04 పీరియడ్‌లో రాహుల్ ద్రావిడ్ శరీరం సహకరించకపోవడంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం వెతుకుతున్న భారత జట్టుకి మహేంద్ర సింగ్ ధోనీ ఓ వరంలా దొరికాడు...

713

అయితే మొదటి నాలుగు వన్డేల్లో మహేంద్ర సింగ్ ధోనీ ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో అతను కూడా ఇలా వచ్చి, అలా కనుమరుగవుతాడని భావించారంతా...

813

అలాంటి సమయంలోనే 2004లో వైజాగ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డేలో వన్‌డౌన్‌లో వచ్చి 148 పరుగులు చేసి అదరగొట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ...

913

ఆ ఒక్క ఇన్నింగ్స్... మహేంద్ర సింగ్ ధోనీకి టీమిండియాలో స్థిరమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. అందుకే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచుల్లో మాహీ బ్యాటుతో అదరగొట్టేవాడు...

1013

ఓ మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన మాహీకి ట్రోఫీని అందించిన అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్... ‘ధోనీ నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది... దాన్ని కట్ చేయించకు...’ అంటూ కోరాడు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే మాహీ షార్ట్ హెయిర్ స్టైయిల్‌లో కనిపించాడు.

1113

అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మాహీ బ్యాటింగ్ చూసి అబ్బురపడిపోయిన పర్వేజ్ ముషారఫ్, టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ దగ్గరకు వచ్చి... ‘ఈ ధోనీ ఎక్కడ దొరికాడు మీకు?’ అంటూ ప్రశ్నించాడట...

1213

దానికి గంగూలీ... ‘అతను వాగా బార్డర్‌ దగ్గర నడుస్తుంటే, మేం వెంటనే లోపలికి లాగేసుకున్నాం...’ అంటూ సమాధానం ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా గంగూలీయే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు...

1313

టీమిండియా బాగు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే సౌరవ్ గంగూలీ, భారత జట్టు ఐసీసీ టైటిల్స్ గెలవాలనే ఉద్దేశంతోనే విరాట్ కోహ్లీని కాదని, రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించి ఉంటాడని... దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు దాదా ఫ్యాన్స్...

Read more Photos on
click me!

Recommended Stories