బుమ్రా నుంచి బెయిర్ స్టో వరకు.. టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్న స్టార్ ఆటగాళ్లు వీళ్లే..

Published : Oct 09, 2022, 04:07 PM ISTUpdated : Oct 09, 2022, 04:09 PM IST

T20I World Cup 2022: జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఏ క్రికెటర్‌కు అయినా  ఐసీసీ నిర్వహించే టోర్నీలలో పాల్గొనాలని.. అక్కడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఈ ఆటగాళ్లకు మాత్రం ఈసారి ఆ అవకాశం లేదు. 

PREV
18
బుమ్రా నుంచి బెయిర్ స్టో వరకు.. టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్న స్టార్ ఆటగాళ్లు వీళ్లే..

ఏ క్రీడలో అయినా  తమ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తారు క్రీడాకారులు.   ఇతర క్రీడలలో అయితే ఒలింపిక్స్ ఆడటం.. అక్కడ  దేశానికి పతకాలు సాధించడం వంటి లక్ష్యాలు పెట్టుకుంటారు క్రీడాకారులు. క్రికెట్ లో అయితే  ఒలింపిక్స్ లేవు కాబట్టి ఆ స్థానంలో ఐసీసీ టోర్నీలు ఉంటాయి. 
 

28

ఐసీసీ టోర్నీలలో ఆడాలని..  ద్వైపాక్షిక సిరీస్ లలో మాదిరిగానే  అక్కడా సత్తా చాటాలని ప్రతీ  క్రికెటర్ కోరుకుంటాడు. ఆ మేరకు ఫిట్నెస్, ఆట మీద దృష్టి పెట్టినా ఒక్కోసారి అదృష్టం ‘గాయం’, ‘ఫామ్’ రూపంలో అడ్డం తిరుగుతుంది.  దురదృష్టవశాత్తూ గాయపడో లేక ఫామ్ కోల్పోయో రాబోయే టీ20   ప్రపంచకప్ కు మిస్ అయిన స్టార్ ఆటగాళ్లెవరో ఇక్కడ చూద్దాం.

38

జానీ బెయిర్ స్టో : ఈ ఇంగ్లాండ్ బ్యాటర్ ఒంటిచేత్తో మ్యాచ్ గమనాన్ని మార్చేయగలడు. ఇటీవలి కాలంలో మూడు ఫార్మాట్లలో తనదైన ముద్ర వేస్తున్న బెయిర్ స్టో.. ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ ప్రకటించిన 15 మంది సభ్యులలో ఎంపికయ్యాడు. కానీ జట్టును ప్రకటించి ఒక్క రోజు కూడా గడవకముందే   కాలి గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. బెయిర్ స్టో భర్తీ చేయగల ఆటగాడు ఇంగ్లాండ్ కు దొరకడం కష్టమే.

48

డ్వేన్ ప్రిటోరియస్ : దక్షిణాఫ్రికాకు చెందిన ఈ ఆల్ రౌండర్ భారత్ తో ఇటీవలే ముగిసిన  మూడో టీ20లో గాయపడ్డాడు. కొద్దిరోజుల క్రితమే వేలుకు సర్జరీ చేయించుకుని ఫీల్డ్ లో దిగిన ప్రిటోరియస్ కు గాయం తిరగబెట్టడంతో  అతడు ప్రపంచకప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

58

జస్ప్రీత్ బుమ్రా : టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కానీ  దక్షిణాఫ్రికా సిరీస్  ప్రారంభానికి ముందు గాయం తిరగబెట్టడంతో  అతడు  కూడా ఈ మెగా టోర్నీ నుంచి దూరమయ్యాడు. 

68
Jason Roy

జేసన్ రాయ్ :   బట్లర్ మాదిరే రాయ్ కూడా ఇంగ్లాండ్ క్రికెటరే.  అయితే  రాయ్  గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడంటే పప్పులో కాలేసినట్టే. జేసన్ కు గాయమేమీ కాలేదు. కానీ గత ఏడాది కాలంగా రాయ్.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు.   అప్పటికే జేసన్ రాయ్ కు పలు అవకాశాలిచ్చిన  ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)  టీ20 ప్రపంచకప్ లో అతడికి షాకిచ్చింది. రాయ్ కు కాంపిటీటర్ గా ఉన్న  అలెక్స్ హేల్స్ మాత్రం  దుమ్మురేపుతున్నాడు. దీంతో  రాయ్ ప్రపంచకప్ కు దూరం కావాల్సి వచ్చింది. 

78

ఆండ్రూ రసెల్ : వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రసెల్ కూడా  ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు.  రాయ్ మాదిరిగానే రసెల్ కూడా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లలో రాణించే  రసెల్..  విండీస్ క్రికెట్ బోర్డుతో కూడా కయ్యాలు పెట్టుకుంటున్నాడు. బోర్డు-రసెల్ మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తున్నది. దీంతో ప్రపంచకప్ లో  రసెల్ కు చోటు దక్కలేదు. 
 

88

షిమ్రన్ హెట్మెయిర్ : పైన పేర్కొన్న ఆటగాళ్లందరూ తప్పుకోవడానికి ఒక్కో కారణముంది. కానీ హెట్మెయిర్ మాత్రం విచిత్రమైన కారణంతో తప్పుకున్నాడు.  రెండు టీ20 ల కోసం ఆస్ట్రేలియా బయల్దేరిన  విండీస్ జట్టుతో కాకుండా రెండ్రోజుల తర్వాత వెళ్లాల్సి ఉన్నా.. విమానం బయల్దేరే సమయానికి విమానాశ్రయానికి వెళ్లకుండా  నిర్లక్ష్యంగా వ్యవహరించి అందుకు తగిన ప్రతిఫలం అనుభవించాడు. 

click me!

Recommended Stories