వరల్డ్ కప్ 2020: టీమిండియా సీనియర్లూ జాగ్రత్త...ఈ యువకులతోనే ప్రమాదం

First Published Sep 17, 2019, 3:31 PM IST

ఐసిసి టీ20 ప్రపంచ కప్ కోసం భారత సెలెక్టర్లు ఇప్పటినుండే ప్రయోగాలు ప్రారంభించారు. అందుకోసం టీమిండియా తరపున ఆడే అవకాశాన్ని కొంతమంది యువ క్రికెటర్లకు లభిస్తోంది. అయితే వీరికిలా అవకాశమివ్వడంతో సీనియర్ల స్ధానాలకు ఎసరొచ్చింది.     

వన్డే ప్రపంచ కప్ లో అద్భుతంగా ఆడినప్పటికి కోహ్లీ సేన ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది. వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా నిర్ణయాత్మక మ్యాచ్ లో మాత్రం ఓటమిపాలయ్యింది. ఈ వైపల్యానికి ఆటగాళ్ల ఎంపిక, జట్టు కూర్పు సరిగ్గా లేదని అభిమానులతో పాటు కొందరు క్రికెట్ విశ్లేషకులు ఆరోపించారు. దీంతో ఇలాంటి విమర్శలను టీ20 ప్రపంచ కప్ లో ఎదురవరకుండా వుండేందుకు సెలెక్షన్ కమిటీ ముందస్తు వ్యూహాలతో సంసిద్దమవుతోంది. ఇప్పటినుండి టీమిండియా పాల్గొనే టీ20 సీరిసుల్లో జూనియర్లకు అవకాశమిచ్చి పరీక్షించాలని భావిస్తోంది. సెలెక్టర్ల ఈ ఆలోచన సీనియర్ల స్ధానానికి గండికొట్టేలా వుంది. ఇలా ఇకపై భారత జట్టులో సీనియర్లు Vsజూనియర్ల మధ్య పోటీ సాగనుందన్నమాట.
undefined
పంత్ Vs సంజూ శాంసన్: వెస్టిండిస్ పర్యటనలో భాగంగా జరిగిన మూడు ఫార్మాట్ల సీరిసుల్లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు అవకాశం లభిచింది. అయితే ఈ అవకాశాలన్నింటిని అతడు చేజార్చుకున్నాడు. వికెట్ కీపర్ గానే కాకుండా బ్యాట్స్ మెన్ గా కూడా విఫలమయ్యాడు. దీంతో అతడు అభిమానుల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ధోని స్థాయిలో ఆడకున్నా పరవాలేదు కానీ మరీ ఇలా ఆడితే ఎలాగంటూ పంత్ ని ప్రశ్నిస్తున్నారు.
undefined
వెస్టిండిస్ పర్యటనలో విఫలమైనా సెలెక్టర్లు పంత్ ని దక్షిణాఫ్రికాతో జరగనున్న సీరిస్ కు ఎంపికచేశారు. ఇందులోనూ అతడు విఫలమైతే అతడి అవకాశాలు సన్నగిల్లనున్నాయి. ఇదే అతడికి గట్టిపోటినిచ్చేది మరో యువ సంచలనం సంజూ శాంసనే. ఈ కేరళ ఆటగాడు ఐపిఎల్ తో పాటు భారత-ఏ జట్టు తరపున అద్భుత ప్రదర్శన చేస్తూ జట్టులో చోటుకోసం ఎదురుచూస్తున్నాడు. కాబట్టి పంత్ విఫలమైతే శాంసన్ ను పరీక్షించే అవకాశాలున్నాయి.
undefined
పంత్ Vs కేఎస్ భరత్: పంత్ కు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ గా గట్టి పోటీనిచ్చే అవకాశమున్న మరో యువ కెరటం కెఎస్ భరత్. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఆటగాడి పేరును గతంలోనే వెస్టిండిస్ పర్యటన కోసం పరిశీలించినట్లు స్వయంగా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. కాబట్టి పంత్ విఫలమైతే సంజూ శాంసన్, భరత్ లలో ఎవరో ఒకరు ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలే ఎక్కువగా వున్నాయి.
undefined
భువనేశ్వర్ Vs నవదీప్ సైనీ: భారత యువ సంచలనం నవదీప్ సైనీ వెస్టిండిస్ పర్యటనలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆరంగేట్ర మ్యాచ్ లోనే అద్భుత ప్రదర్శన చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. కొత్తబంతితో మాయ చేయగల సత్తా వున్న ఇతడితో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు ప్రమాదం పొంచి వుంది. సైనీ ఇదే ప్రదర్శనను టీ20 ప్రపంచ కప్ వరకు కొనసాగిస్తే జట్టులో దక్కించుకోవడం ఖాయం. అతడికి అవకాశం దక్కితే ఓపెనింగ్ బౌలర్ భువనేశ్వర్ ను పక్కనబెట్టాల్సి రావచ్చు.
undefined
సీనియర్లను భయపెడుతున్న మరికొంత మంది జూనియర్లు: భారత జట్టులో ఎలాగైనా చోటు దక్కించుకోవాలని భావిస్తున్న యువ ఆటగాళ్లు చాలామంది వున్నారు. అయితే అందులో సెలెక్టర్లు టీ20 ప్రపంచ కప్ కోసం పరీక్షించాలనుకుంటున్న వారిలో మొదట వినిపిస్తున్న పేరు శుభ్ మన్ గిల్. మాజీ ఆటగాళ్లు కొందరు గిల్ ప్రతిభను ప్రశంసిస్తూ అతడికి అవకాశమమివ్వాలని సెలెక్టర్లు సూచించారు. అంతేకాకుండా దేశవాళి క్రికెట్ లో సత్తాచాటిన అతడు దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సీరిస్ ఆడే అవకాశాన్ని పొందాడు.
undefined
యువ స్పిన్నర్న్ మయాంక్ మార్కండే కూడా దేశవాళి క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అలాగే సిద్దార్థ్ కౌల్, నితీశ్ రాణా, సందీప్ శర్మ లు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిని పరీక్షించాలని సెలెక్టర్లు భావిస్తే సీనియర్ ఆటగాళ్ల స్థానాలకు ముప్పు వాటిల్లినట్లే.
undefined
చాహల్, కుల్దీప్ Vs సుందర్, చాహర్: యజువేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్...కొంతకాలంగా వీరిద్దరే భారత జట్టులో ప్రధాన స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ని పక్కనపెట్టి సెలెక్టర్లు వీరికి అవకాశం కల్పించారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు కదా. ఇప్పుడు వీరి స్థానాలకు జూనియర్లతో ముప్పు ఏర్పడింది. టీ20 ప్రపంచ కప్ కోసం యువకులను పరీక్షించాలని భావిస్తున్న సెలెక్టర్లు దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సీరిస్ కు వీరిద్దరిని దూరం పెట్టారు. వీరిస్థానంలో వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్ లను ఎంపికచేశారు. ఈ సీరిస్ లో వీరు రాణిస్తే చాహల్, కుల్దీప్ ల స్ధానానికి ఎసరు వచ్చినట్లే.
undefined
click me!