అలాంటి షూస్ వేసుకుని బ్యాటింగ్ చేయండి... స్పిన్ పిచ్‌లపై ఎలా ఆడాలో చెప్పిన అజారుద్దీన్...

First Published Feb 27, 2021, 4:24 PM IST

రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ బాగానే రాణించారు. కానీ మూడో టెస్టు సమయానికి పరిస్థితి మారిపోయింది. చెన్నైలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ మినహా అహ్మదాబాద్ టెస్టులో  మిగిలిన బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయారు. కోహ్లీతో పాటు పూజారా, రహానే లాంటి టెస్టు స్పెషలిస్టు ప్లేయర్లు కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు...

స్పిన్‌ ఆడడానికి తెగ ఇబ్బంది పడే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అయితే తొలి ఇన్నింగ్స్‌లో 112, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకి ఆలౌట్ అయ్యి, టెస్టు క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే స్పిన్ పిచ్‌పై బ్యాటింగ్ చేయాలంటే చిన్నపాటు మార్పును ఫాలో అయితే చాలంటున్నాడు భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్...
undefined
‘అహ్మదాబాద్ టెస్టులో బ్యాట్స్‌మెన్ అందరూ ఫెయిల్ కావడం చాలా నిరాశపరిచింది. ఇలాంటి డ్రై పిచ్‌ల మీద బ్యాటింగ్ చేయాలంటే షాట్ సెలక్షన్‌తో పాటు ఫుట్‌వర్క్ కరెక్టుగా ఉండాలి...
undefined
బ్యాటింగ్ చేసేటప్పుడు స్పైక్స్ వేసుకోవడం చాలా కామన్ విషయం. కానీ రబ్బర్ సోల్స్ ఉన్న షూలు వేసుకుంటే ఇక్కడ చక్కగా బ్యాటింగ్ చేయొచ్చు. ఇలాంటి షూలు వేసుకుని, స్పిన్ పిచ్‌లపై పరుగుల ప్రవాహం పారించిన టెస్ట్ ఇన్నింగ్స్‌లు నేను ఎన్నో చూశాను...
undefined
ఇలా రబ్బర్ సోల్స్ ఉన్న షూలు వేసుకుంటే వికెట్ల మధ్యన పరుగెత్తేటప్పుడు పడిపోతారని చాలామంది వాదిస్తారు. కానీ నిజానికి వింబుల్డన్ పెద్ద టోర్నీల్లో టెన్నిస్ ప్లేయర్లు అందరూ ఇలాంటి రబ్బర్ సోల్స్ ఉన్న షూలనే వాడతారు...
undefined
అంతేకాదు భారత క్రికెటర్లు సునీల్ గవాస్కర్, మోహిందర్ అమర్‌నాథ్, దిలీప్ వెంగ్‌సర్కార్‌తో పాటు సర్ వీవిన్ రిచర్డ్స్, మైక్ గెట్టింగ్, అలెన్ బోర్డర్, క్లైయిన్ లార్డ్, ఇంకా ఎంతో మంది విదేశీ క్రికెటర్లు కూడా ఇక్కడ బ్యాటింగ్ చేసేటప్పుడు ఇలాంటి షూలు వేసుకునేవారు...’ అంటూ వరుస ట్వీట్లు చేశాడు అజారుద్దీన్...
undefined
మహ్మద్ అజారుద్దీన్ ఇచ్చిన సలహాపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు నెటిజన్లు. అజారుద్దీన్ సలహాను ఫాలో అయితే బ్యాట్స్‌మెన్ ఈజీగా పరుగులు చేయొచ్చు అని కొందరు అంటుంటే, ఇలా బహిరంగంగా చెప్పడం వల్ల ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఈ సలహాను ఫాలో అయితే ఎలాగని నిలదీస్తున్నారు మరికొందరు..
undefined
click me!