స్పిన్ ఆడడం రానప్పుడే, ఇలాంటి సాకుల గురించి వెతుకుతారు... ఇంగ్లాండ్ జట్టుపై గ్రేమ్ స్వాన్ ఫైర్...

First Published | Feb 27, 2021, 1:17 PM IST

మొదటి టెస్టులో భారీ విజయం తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో ఓడింది ఇంగ్లాండ్ జట్టు. మొదటి టెస్టులో గెలిచినప్పుడు బ్యాటింగ్‌కి స్వర్గధామమైన పిచ్ గురించి ఎలాంటి విమర్శలు చేయని ఇంగ్లాండ్, ఆ తర్వాత రెండు టెస్టుల పిచ్‌ల పైన తీవ్రమైన విమర్శలు చేసింది. ఈ విమర్శలపై తీవ్రంగా స్పందించాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్...

భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడుతున్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్... వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో 200 మార్కును అందుకోలేకపోయారు... పింక్ బాల్ టెస్టులో అయితే రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా ఈ స్కోరు చేయలేకపోయారు.
మొతేరా స్టేడియంలో జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లాండ్, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే చాప చుట్టేసింది... అక్షర్ పటేల్‌ 11 వికెట్లు తీయగా రవిచంద్రన్ అశ్విన్‌కి ఏడు వికెట్లు దక్కాయి. ఇదే పిచ్‌పై ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 5, స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు తీశారు...

‘ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు పూర్తిగా పేస్ పిచ్‌లపై ఆడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటిదాకా వాళ్లు ఎప్పుడూ ఈ పిచ్‌ల గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు స్పిన్ పిచ్‌ల గురించి మాట్లాడుతున్నారు...
పిచ్ కాదు, మనవాళ్ల బ్యాటింగ్ బాగోలేదు. స్పిన్ బౌలింగ్‌ను మనవాళ్లు సరిగా ఆడలేకపోతున్నారు. వారిని విమర్శించలేక, పిచ్‌పైన పడి ఏడుస్తున్నట్టుగా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్...
‘పింక్ బాల్ టెస్టులో బ్యాటింగ్ చేయడం అంత తేలిక కాదు. గత ప్రదర్శనలతో పోలిస్తే ఇంగ్లాండ్ బాగానే ఆడింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలింగ్ అద్భుతంగా ఉంది...
ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భారత స్పిన్నర్లు, మంచి ఫలితాన్ని రాబట్టారు. నాలుగో టెస్టు కూడా మొతేరా లోనే ఆడాలి. అప్పుడు కూడా ఇదే పిచ్ ఉంటుంది... మళ్లీ పిచ్‌పైనే విమర్శలు చేయడానికే రెఢీగా ఉంటారా... తప్పులను సరిదిద్దుకుంటారా?
పిచ్ టర్న్ అవుతోందని చెప్పడం పిచ్చి సాకులను వెతుక్కున్నట్టే అవుతుంది. స్ట్రైయిట్ బాల్స్‌కి ఎక్కువ వికెట్లు పడినప్పుడు, టర్న్ అవుతుందని చెప్పడం పనికి మాలిన సాకులు చెప్పినట్టే అవుతుంది....
భారత స్పిన్నర్లను ఎదుర్కోవాలంటే మరింత ప్రాక్టీస్ చేయాలి. మరింత కష్టపడాలి... మూడు రోజులు అదనంగా దొరికింది. ఈ సమయాన్ని స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా కష్టపడేందుకు ఉపయోగించడం.
అండర్సన్ బౌలింగ్‌ను ఎదుర్కునేందుకు విరాట్ కోహ్లీ చాలా కష్టపడేవాడు. కానీ ఆ తప్పులను మళ్లీ రిపీట్ చేయకుండా చాలా ప్రాక్టీస్ చేశాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఇప్పుడు అలాంటి పోరాటతత్వాన్ని చూపించాలి’ అంటూ కామెంట్ చేశాడు గ్రేమ్ స్వాన్...

Latest Videos

click me!