ఇంగ్లాండ్‌లో ఆ 42 రోజులు ఏం చేయమంటారు... బీసీసీఐని ప్రశ్నించిన మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్...

First Published Jun 1, 2021, 4:09 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం 17 రోజులు ముందుగానే ఇంగ్లాండ్ గడ్డ మీద అడుగుపెడుతున్న భారత జట్టు, సెప్టెంబర్ 15 దాకా అక్కడే ఉండబోతోంది. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 15దాకా సాగే నాలుగున్నర నెలల సుదీర్ఘ టూర్‌లో వాళ్లు ఆడేది ఆరంటే ఆరు టెస్టులే...

జూన్ 18 నుంచి 22 వరకూ న్యూజిలాండ్‌తో సౌంతిప్టన్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది భారత జట్టు. టెస్టు ఫార్మాట్‌తో జరుగుతున్న ఈ మెగా టోర్నీ ఫైనల్ ముగిసిన తర్వాత అక్కడే ఉంటుంది.
undefined
ఆగస్టు 4న ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం అవుతుంది. అంటే జూన్ 22 నుంచి ఆగస్టు 4 దాకా మధ్యలో సమయం మొత్తం అక్కడే కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. అదే టైంలో ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచులను పూర్తిచేసేయొచ్చు కూడా...
undefined
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు, ఆ తర్వాత శ్రీలంక, పాకిస్తాన్‌లతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడుతుంది. ఆ తర్వాతే టీమిండియాతో టెస్టు సిరీస్ ఆరంభం అవుతుంది...
undefined
‘వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం టీమిండియాను ఇంగ్లాండ్‌కి పంపుతున్నారు బాగానే ఉంది. అయితే ఆ మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ ఆరంభమయ్యేదాకా ఆ నెలన్నర టీమిండియా అక్కడేం చేస్తుంది? ఈ షెడ్యూల్ చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయా...
undefined
ఓ టూర్‌ను ఇలా ఎలా తయారుచేస్తారు? ఒక్క టెస్టు మ్యాచ్ ఆడి, ఎలాంటి క్రికెట్ ఆడకుండా నెలన్నర గడిపి, ఆ తర్వాత టెస్టు సిరీస్ ఆడతారా? అసలు ఏ మాత్రం బుద్ధితో తయారుచేసిన షెడ్యూల్ ఏనా ఇది...
undefined
జూలైలో శ్రీలంక మూడు టీ20, మూడు వన్డే మ్యాచులు, పాకిస్తాన్‌తో మూడు వన్డే, టీ20 మ్యాచులు ఆడుతుంది ఇంగ్లాండ్ జట్టు. ఏ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ముగిసిన తర్వాత టెస్టు సిరీస్ ఆడొచ్చు కదా...
undefined
లేదా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి, మళ్లీ టెస్టు సిరీస్ ఆరంభమయ్యే సమయానికి తిరిగి వెళ్లొచ్చు కదా... నెలన్నర రోజులు అక్కడే ఉండడం ఎందుకు?
undefined
ఒకవేళ భారత ప్లేయర్లు కౌంటీ మ్యాచులు ఆడతారనుకున్నా, నెలన్నర రోజులు చాలా ఎక్కువ. ఇది చాలా వింతగా ఉంది. ఇలాంటి షెడ్యూల్ టీమిండియాకి ఏ మాత్రం మంచిది కాదు.
undefined
టెస్టు సిరీస్ ఆడడానికి భారత జట్టు, ఇంగ్లాండ్‌కి వెళ్లి ఉంటే, గ్యాప్ లేకుండా టెస్టులు ఆడించండి. మధ్యలో పాక్‌తో, శ్రీలంకతో సిరీస్‌లు ఎందుకు?’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్.
undefined
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలో ఇంగ్లాండ్ బీ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. అయితే శ్రీలంక జట్టు, ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత ఈ సిరీస్ మొదలవుతుంది. విరాట్ కోహ్లీ టీమ్ మాత్రం ఇంగ్లాండ్‌లో నెలన్నర రోజులు ఖాళాగా కూర్చోవాల్సి ఉంటుంది.
undefined
click me!