Published : Jul 31, 2026, 04:08 PM ISTUpdated : Jul 31, 2026, 04:19 PM IST
టీమిండియా క్రికెటర్ అజింక్య రహానె అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అతడు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే మరో ఐదుగురు ఆటగాళ్లు కూడా అదే బాటలో ఉన్నారనే చర్చ మొదలైంది. అంటే రహానేది ట్రైలర్ మాత్రమే… ఇకపై రిటైర్మెంట్ సినిమా ఉంటుందన్నమాట.
రిటైర్మెంట్ కు సిద్దంగా ఉన్న ఇండియన్ క్రికెటర్లు వీళ్లే..
టీమిండియా క్రికెటర్ అజింక్య రహానె సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు… దీంతో అభిమానులే కాదు క్రికెట్ పండితులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ రిటైర్మెంట్ పరంపర రహానేతో ఆగేలా కనిపించడంలేదు… మరికొందరు ఆటగాళ్లు కూడా రహానే బాటలోనే నడిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గత మూడేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న రహానె చివరికి కఠిన నిర్ణయం తీసుకోక తప్సలేదు. ఇలా రహానేే లాగే సెలక్షన్ కమిటీ పదేపదే పక్కన పెడుతుండటంతో ఎక్కువగా ఆడే అవకాశం రాని ఆటగాళ్లు రిటైర్మెంట్ కు సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే మరో ఐదుగురు ఆటగాళ్లు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని క్రీడావర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
26
1. భువనేశ్వర్ కుమార్
స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ వయసు పెరిగినా బౌలింగ్ లో పదును తగ్గలేదు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఛాంపియన్‌గా నిలవడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు… ఈ మెగా టోర్నీలో టాప్ వికెట్ టేకర్స్ లో ఒకడిగా నిలిచాడు. ఇంతబాగా ఆడుతున్నా బిసిసిఐ గానీ, సెలక్షన్ కమిటీ గానీ చాలా కాలంగా భువీని పట్టించుకోవడం లేదు. అందుకే త్వరలోనే భువనేశ్వర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.
36
2. శార్దూల్ ఠాకూర్
శార్దూల్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రస్తుతం గందరగోళంలో ఉంది. ముఖ్యంగా హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్ వంటి యువ ఆటగాళ్లు జట్టులోకి రావడంతో శార్దూల్ తిరిగి టీమిండియాలోకి రావడం మరింత కష్టంగా మారింది. ప్రస్తుతం కామెంటరీ చేస్తున్న శార్దూల్, త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. అతడు కూడా రిటైర్మెంట్ ఆలోచనలోనే ఉన్నాడని తెలుస్తోంది.
భారత టెస్ట్ జట్టులో అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఇషాంత్ శర్మ ఒకడు. వన్డే, టీ20 ఫార్మాట్స్ లో కూడా అద్భుతాలు చేయగల సత్తా ఇతడికి ఉంది… ఐపిఎల్ లో రాణించినా ఇతడికి అవకాశాలు దక్కడంలేదు. ఇషాంత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ చివరి దశలో ఉన్నాడు… చివరగా ఇండియా తరపున ఆడి గౌరవంగా క్రికెట్ కు వీడ్కోలు పలకాలని చూస్తున్నాడు. అయితే ఇది జరిగేలా కనిపించడంలేదు… 37 ఏళ్ల ఇషాంత్ మళ్లీ టీమిండియాలోకి రావడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. అందుకే ఇతడు త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
56
4. కరణ్ నాయర్
టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించిన ఆటగాడు కరుణ్ నాయర్. ఏడేళ్ల తర్వాత ఇటీవలే మళ్లీ అతడికి అవకాశం వచ్చింది… టీమిండియాలోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. నాలుగు అవకాశాలు చేజార్చుకోవడంతో కరణ్ నాయర్ మళ్లీ జట్టులోకి రావడం అనుమానమే. అందుకే అతను కూడా రిటైర్మెంట్ అంచున ఉన్నాడు.
66
5. మహ్మద్ షమీ
ఒకప్పుడు టీమిండియాలో స్టార్ బౌలర్ గా ఓ వెలుగు వెలిగిన షమీ ఇప్పుడు అవకాశం కొసం ఎదురుచూడాల్సి వస్తోంది. జట్టులో చోటు కోల్పోయినా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు… అయినా బీసీసీఐ సెలక్షన్ కమిటీ మహమ్మద్ షమీని పదేపదే విస్మరిస్తోంది. ఇదే కారణంగా రాబోయే రోజుల్లో షమీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించే అవకాశం ఉంది.