అక్షర్ పటేల్‌తో ఆఖరి ఓవర్ వేయించిన హార్ధిక్ పాండ్యా... కావాలనే ప్రయోగం చేశానంటున్న కెప్టెన్...

Published : Jan 04, 2023, 10:19 AM IST

టీ20ల్లో స్పిన్నర్లను ఎలా వాడాలనేది కెప్టెన్‌పైనే ఆధారపడి ఉంటుంది. చాలా వరకూ పవర్ ప్లే ముగిసిన తర్వాత బౌలింగ్‌కి వచ్చే స్పిన్నర్లు, డెత్ ఓవర్లలోపే కోటాని ముగించేసుకుంటారు. కొన్నిసార్లు పవర్ ప్లేలోనూ స్పిన్నర్లు రావడం కనిపిస్తుంది... అయితే హార్ధిక్ పాండ్యా ఈ రూల్‌ని మార్చేశాడు.. 

PREV
17
అక్షర్ పటేల్‌తో ఆఖరి ఓవర్ వేయించిన హార్ధిక్ పాండ్యా... కావాలనే ప్రయోగం చేశానంటున్న కెప్టెన్...

భారత జట్టు స్పిన్నర్లతో ఆఖరి ఓవర్‌ వేయించినప్పుడు సరైన ఫలితాలు రాలేదు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో హర్భజన్ సింగ్‌కి ఇంకా ఓవర్లు మిగిలి ఉన్నా జోగిందర్ శర్మతో చివరి ఓవర్ వేయించి, సక్సెస్ సాధించాడు మహేంద్ర సింగ్ ధోనీ...

27
Image credit: PTI

అయితే ధోనీ కంటే భిన్నంగా ఆలోచించాడు హార్ధిక్ పాండ్యా. శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో స్పిన్నర్ అక్షర్ పటేల్‌కి ఆఖరి ఓవర్ అందించాడు. హార్ధిక్ పాండ్యా 3 ఓవర్లు మాత్రమే వేశాడు. ఆఖరి ఓవర్ అతనే వేసి ఉండొచ్చు కానీ అలా చేయలేదు...

37
Image credit: PTI

‘కెప్టెన్ అయ్యాక సీరియస్‌గా ఉండడం అలవాటు చేసుకున్నా. నవ్వితే టీమ్ మేట్స్ కూల్ అయిపోతారని ముఖాన్ని సీరియస్‌గా పెట్టాను. సరిగ్గా నిద్ర పోలేదు, సరిగ్గా నీళ్లు కూడా తాగలేదు... అందుకేనేమో నా కండరాలు పట్టేశాయి...
 

47
Image credit: PTI

అదీకాకుండా ఇలాంటి పరిస్థితులను ప్లేయర్లు ఎలా ఫేస్ చేస్తారో చూడాలనుకున్నా. ఆఖరి ఓవర్ స్పిన్నర్‌కి ఇస్తే జట్టుపై ప్రెషర్‌ మరింత పెరుగుతుంది. అలాంటప్పుడే మనలోని నిజమైన సత్తా బయటికి వస్తుంది. అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు...

57
Image credit: PTI

ఐపీఎల్‌లో శివమ్ మావి చక్కగా బౌలింగ్ చేశాడు. అతన్ని చాలా రోజులుగా గమనిస్తూ వస్తున్నాం. అందుకే టీమ్‌లోకి తీసుకొచ్చాం. నేను బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. నా ఫిట్‌నెస్‌పై సందేహాలు అవసరం లేదు... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా నయా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

67

అక్షర్ పటేల్ బౌలింగ్‌కి వచ్చే సమయానికి ఆఖరి ఓవర్‌లో శ్రీలంక విజయానికి 13 పరుగులు కావాలి. మొదటి బంతి వైడ్. ఆ తర్వాతి బంతికి సింగిల్ రాగా... రెండో బంతికి పరుగులేమీ ఇవ్వలేదు అక్షర్ పటేల్. 4 బంతుల్లో 11 పరుగులు కావాల్సిన దశలో కరుణరత్నే ఓ సిక్సర్ బాదాడు...

77
Team India vs sri lanka

3 బంతుల్లో 5 పరుగులే కావాల్సి రావడంతో లంక ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అనుకున్నారంతా.  అయితే ఆఖరి రెండు బంతుల్లో ఇద్దరు బ్యాటర్లు రనౌట్ కావడంతో శ్రీలంక 160 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత జట్టుకి 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం దక్కింది.. 
 

click me!

Recommended Stories