ధోనీ, యువీ, గంభీర్, సెహ్వాగ్ వంటి లెజెండ్స్‌ను పక్కనబెట్టడం వల్ల ఎన్నో గొడవలు... - మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే...

First Published Jun 8, 2021, 4:55 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్... భారత జట్టుకి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించిన ఈ లెజెండరీ క్రికెటర్లకు కెరీర్ ముగింపు దశలో సరైన గౌరవం దక్కలేదు. కనీసం ఫేర్‌వెల్ మ్యాచ్ కూడా లేకుండానే కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశారు ఈ క్రికెటర్లు. దీనికి కారణం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని మాజీ సెలక్టర్లు...

2016 నుంచి 2020 వరకూ టీమిండియాకి ఛీఫ్ సెలక్టర్‌గా వ్యవహారించిన ఎమ్మెస్కే ప్రసాద్, ఆ సమయంలో జట్టు ఎంపిక విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అంబటి రాయుడి వంటి ప్లేయర్‌ను పక్కనబెట్టి విజయ్ శంకర్ వంటి యంగ్ ప్లేయర్‌కి 2019 వన్డే వరల్డ్‌కప్‌లో చోటు ఇవ్వడంపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది...
undefined
‘భారత జట్టు సెలక్టర్లుగా మాకు టీమ్ ప్రయోజనాలే ముఖ్యం. దాంట్లో ఎలాంటి ఎమోషన్స్‌కి చోటు ఇవ్వదలుచుకోలేదు. అందుకే లెజెండ్స్ విషయంలో కూడా చాలా కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది...
undefined
సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ లాంటి ప్లేయర్లు క్రికెట్‌లోనే చాలా ప్రత్యేకమైనవాళ్లు. అయితే వారి వ్యక్తిగత ప్రదర్శన కోసం, రికార్డుల కోసం జట్టులో కొనసాగించడం సరైన నిర్ణయం కాదు. అలాంటి సమయాల్లో సెలక్టర్ల పాత్ర చాలా క్లిష్టంగా ఉంటుంది.
undefined
ఓ ప్లేయర్‌ను జట్టులో తప్పిస్తే వారి ఫ్యాన్స్ నుంచి, జనాల నుంచి తీవ్రమైన విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అది మా పని. వారితో మాకు ఎలాంటి వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు ఉండవు కదా...
undefined
భారత జట్టు భవిష్యత్తుకి ఏది సరైన నిర్ణయం అనిపిస్తే, దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత జట్టు ప్రదర్శన చూస్తుంటే గర్వంగా ఉంది. టీమిండియా ఇంతకంటే అద్భుతంగా రాణించగలదు. ఎందుకంటే ఇప్పుడు భారత జట్టు రిజర్వు బెంచ్ చాలా పటిష్టంగా తయారైంది...
undefined
కొన్నిసార్లు జట్టు ఎంపిక విషయంలో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, విరాట్ కోహ్లీతో మాకు గొడవలు కూడా జరిగేవి. కొన్నిసార్లు చాలా మాటలు అనుకునేవాళ్లం. తిట్టుకునేవాళ్లం. కానీ మా గొడవలు, ఆలోచనలు, ప్రయత్నాలు అన్నీ జట్టు మంచి కోసమే...
undefined
అందుకే మరుసటి రోజు కలవగానే మళ్లీ మామూలుగా మాట్లాడుకునేవాళ్లం. నాకు ఏ ప్లేయర్‌తోనూ ఎలాంటి గొడవలు లేవు. ముఖ్యంగా ఓ క్రికెటర్‌ని (అంబటి రాయుడిని) నేను కావాలని జట్టు నుంచి తప్పించానని చాలామంది అనుకున్నారు. కానీ నాకు అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు.
undefined
భారత జట్టు నా కుటుంబం లాంటిది. అందులో ప్రతీ సభ్యుడితో నాకు అనుబంధం ఉంటుంది. జట్టు బాగుకోసం కొన్ని భరించకతప్పదు... ’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరూ ఆడాలని చెప్పిన ఎమ్మెస్కే ప్రసాద్, ఇద్దరు స్పిన్నర్లు అవసరమా? అనే ఆలోచన వద్దన్నారు... ‘రవీంద్ర జడేజా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను మ్యాచ్ విన్నర్ అవగలడు. అశ్విన్ కూడా చాలా కీ ప్లేయర్. ఇద్దరు స్పిన్నర్లు అవసరమా? అంటే జడ్డూ బ్యాటింగ్ చేయగలడు కాబట్టి అతన్ని అదనపు బౌలర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రెండు రకాలుగా వాడుకోవచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు ఎమ్మెస్కే ప్రసాద్.
undefined
2019 వన్డే వరల్డ్‌కప్‌లో చివరిసారిగా భారత జట్టు తరుపున ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాత భారత జట్టులో కనిపించలేదు. ధోనీ స్థానంలో రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లకు వన్డే, టీ20 జట్టులో అవకాశాలు కల్పించి ప్రయత్నించింది భారత జట్టు.
undefined
రిషబ్ పంత్ మొదట్లో ఫెయిల్ కావడంతో మహేంద్ర సింగ్ ధోనీని వెనక్కి తీసుకురావాలంటూ డిమాండ్ వినిపించింది. అయితే 2020 ఐపీఎల్ ఆరంభానికి ముందు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు అర్ధాంతరంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు ఎమ్మెస్ ధోనీ...
undefined
ఆశ్చర్యకరంగా ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో అదరగొడుతున్నాడు. వరుసగా ఫెయిల్ అవుతున్నా, అతని మీద నమ్మకం ఉంచి మరిన్ని అవకాశాలు ఇచ్చిన సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్న రిషబ్ పంత్, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకం కానున్నాడు.
undefined
click me!