వేలానికి వదిలేసిన వాళ్లే టైటిల్ గెలిచారు... రిటైన్ చేసుకున్న ప్లేయర్లేమో అట్టర్ ఫ్లాప్...

Published : May 30, 2022, 11:14 AM IST

74 మ్యాచుల పాటు సాగిన సుదీర్ఘ సీజన్‌కి తెరపడింది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌ని ఓడిస్తూ, ఆరంగ్రేటం సీజన్‌లోనే టైటిల్ గెలిచి సరికొత్త చరిత్ర లిఖించింది. కొత్త ఫ్రాంఛైజీ కావడంతో టైటిల్ గెలిచిన జట్టులో ఉన్న ప్లేయర్లు అందరూ, మిగిలిన జట్లు రిటైన్ చేసుకోకుండా వదిలేస్తే... టైటాన్స్‌లోకి వచ్చినవాళ్లే..

PREV
110
వేలానికి వదిలేసిన వాళ్లే టైటిల్ గెలిచారు... రిటైన్ చేసుకున్న ప్లేయర్లేమో అట్టర్ ఫ్లాప్...

ఐపీఎల్‌ గత రెండు సీజన్లలో పెద్దగా పరుగులు చేయలేక, ఫిట్‌గా లేని కారణంగా బౌలింగ్ చేయలేకపోయాడు హార్ధిక్ పాండ్యా. దీంతో అతనికి ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌లో చోటు దక్కలేదు...

210

వేలానికి వెళ్లి ఉంటే హార్ధిక్ పాండ్యా ఓ రూ.11-13 కోట్ల వరకూ దక్కించుకునేవాడేమో. అయితే అతన్ని రూ.15 కోట్లకు డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసి, కెప్టెన్‌గా నియమించింది గుజరాత్ టైటాన్స్. ఈ సీజన్‌లో బ్యాటుతోనే కాకుండా బాల్‌తోనూ మెరిసిన హార్ధిక్ పాండ్యా... 15 మ్యాచుల్లో 487 పరుగులు చేసి, 8 వికెట్లు తీశాడు...

310

గత నాలుగు సీజన్లలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఆడిన శుబ్‌మన్ గిల్‌ని ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. టెస్టు బ్యాటర్ అనే పేరున్న గిల్‌ని రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. గిల్‌కి ఇంత మొత్తం దక్కడం చాలా ఎక్కువని భావించారంతా.

410

అయితే ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో 34.5 సగటుతో 483 పరుగులు చేశాడు శుబ్‌మన్ గిల్. గతంలో 120 కంటే తక్కువ స్ట్రైయిక్ రేటుతో ఆడిన గిల్, ఈ సారి 132కి పైగా స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశాడు..

510
Image credit: PTI

గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి ఆడిన మహ్మద్ షమీని వేలంలో రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో 20 వికెట్లు తీసిన షమీ, 8 ఎకానమీతో బౌలింగ్ చేసి టైటాన్స్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు..

610
Image credit: PTI

గత నాలుగు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన రషీద్ ఖాన్, ఆ ఫ్రాంఛైజీ నుంచి ఏటా రూ.9 కోట్లు అందుకున్నాడు. అయితే ఆ మొత్తం తక్కువగా భావించిన రషీద్ ఖాన్, రిటెన్షన్‌లో ఫస్ట్ ఛాయిస్ కింద రూ.15 కోట్లు డిమాండ్ చేసి, బయటికి వచ్చేశాడు. 

710

రషీద్ ఖాన్‌ని రూ.15 కోట్లకు డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో 6.6 ఎకానమీతో 19 వికెట్లు తీసిన రషీద్ ఖాన్, బ్యాటింగ్‌లోనూ 90 పరుగులు చేసి టైటాన్స్‌కి కీలక విజయాలు అందించాడు...

810

గత రెండు సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌ తరుపున ఆడాడు డేవిడ్ మిల్లర్. రెండు సీజన్లలో కలిపి 10 మ్యాచులు ఆడిన మిల్లర్‌ని ఈసారి పూర్తిగా వాడుకుంది గుజరాత్ టైటాన్స్. ఈ సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన డేవిడ్ మిల్లర్ 68.71 సగటుతో 481 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో మిల్లర్‌కి ఇదే అత్యుత్తమ ప్రదర్శన కూడా...
 

910

గత మూడు సీజన్లలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి రూ.1.6 కోట్లకు ఆడిన లూకీ ఫర్గూసన్‌ని రిటైన్ చేసుకోలేదు ఆ ఫ్రాంఛైజీ. గత సీజన్‌లో 8 మ్యాచుల్లో 13 వికెట్లు తీసి, కేకేఆర్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన లూకీ ఫర్గూసన్, ఈ సీజన్‌లో 13 మ్యాచుల్లో 12 వికెట్లు తీసి... గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.

1010

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న కేన్ విలియంసన్, అబ్దుల్ సమద్, ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న రోహిత్ శర్మ, కిరన్ పోలార్డ్, ఇషాన్ కిషన్, పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న మయాంక్ అగర్వాల్, ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, సీఎస్‌కే రిటైన్ చేసుకున్న రవీంద్ర జడేజా,  మొయిన్ ఆలీ వంటి ప్లేయర్లు సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయితే... వేలానికి విడదుల చేసిన ప్లేయర్లు సూపర్ సక్సెస్ సాధించడం విశేషం... 

Read more Photos on
click me!

Recommended Stories