యాషెస్ సిరీస్ ఎఫెక్ట్... ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు, కెప్టెన్ జో రూట్‌పై...

Published : Feb 04, 2022, 10:54 AM IST

యాషెస్ సిరీస్‌ 2021-22లో ఇంగ్లాండ్ జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారీ అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు, కనీస పోరాటం కూడా చూపించలేకపోయింది...

PREV
111
యాషెస్ సిరీస్ ఎఫెక్ట్... ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు, కెప్టెన్ జో రూట్‌పై...

ఐదు టెస్టుల సిరస్‌లో 4-1 తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా జట్టు, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లింది...

211

సిడ్నీ టెస్టులో అదృష్టం కలిసి రావడంతో ఆఖరి వికెట్‌ని కాపాడుకుని, మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగిన ఇంగ్లాండ్ జట్టు, క్లీన్ స్వీప్‌ను తప్పించుకోగలిగింది...

311

గత ఏడాది బీభత్సమైన ఫామ్‌లో ఉంది, టెస్టుల్లో 1700+ పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన జో రూట్, యాషెస్ సిరీస్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు...

411

5 మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలతో 322 పరుగులు చేసిన జో రూట్, కెప్టెన్సీలో కూడా ఘోరంగా విఫలమయ్యాడు... ఫాస్ట్ బౌలర్లు రాణించినా, బ్యాట్స్‌మెన్ నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రాలేదు...

511

యాషెస్ సిరీస్‌కి ముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్, భారత్‌తో జరిగిన సిరీస్‌లోనూ 2-1 తేడాతో వెనకంజలో ఉంది...

611

ఇంగ్లాండ్ టీమ్ వరుస వైఫల్యాలకు హెడ్ కోచ్‌ని బాధ్యుడిగా చేస్తూ క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు వేసింది ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్... ఆండ్రూ స్ట్రాస్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు...

711

‘వెస్టిండీస్‌లో ఇంగ్లాండ్ కేర్‌టేకర్ కోచ్‌గా ఆండ్రూ స్ట్రాస్ వ్యవహరిస్తారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టును విజయపథంలో నడిపించే కోచింగ్‌ స్టాఫ్‌ను ఎంపిక చేస్తాం...’ అంటూ తెలిపాడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈవో టామ్ హారిసన్..

811

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌పై వేటు పడుతుందని భావించినా, ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగ వాయిదా వేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...

911

వెస్టిండీస్ టూర్‌లో కూడా ఇంగ్లాండ్ టెస్టు టీమ్ విజయాలు అందుకోలేకపోతే, టెస్టు కెప్టెన్‌ని మార్చే దిశగా అడుగులు వేసేందుకు ఈసీబీ ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం...

1011

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన ఇంగ్లాండ్ జట్టు, ఒక్క విజయం మాత్రమే అందుకుని ఆరు మ్యాచుల్లో ఓడింది. 

1111

రెండు టెస్టు మ్యాచ్‌లను డ్రా చేసుకుని, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది... ప్రస్తుతం  9.25 విజయాల శాతంతో ఉన్న ఇంగ్లాండ్, ఫైనల్ చేరుకోవాలంటే అద్భుతం జరగాల్సిందే...

click me!

Recommended Stories