Eng vs NZ Lords Test: లార్డ్స్.. క్రికెట్ మక్కాగా పేరుగాంచిన ఈ స్టేడియంలో తనను తాను నిరూపించుకోవాలని బ్యాట్, బాల్ పట్టి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే ప్రతి క్రికెటర్ అనుకుంటాడు. అంతటి ఘనకీర్తి ఉన్న లార్డ్స్ కు ఇప్పుడు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చేసిన పని వల్ల తీవ్ర అవమానం జరిగింది.
క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియాని ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఈ స్టేడియానికి కూడా ప్రపంచంలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రపంచంలో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే ఏ క్రికెటర్ అయినా తన జీవితంలో కనీసం ఒక్కసారైనా అక్కడ మ్యాచ్ ఆడాలని, తానెంటో నిరూపించుకోవాలని కోరుకుంటాడు.
28
అటువంటి లార్డ్స్ కు ఈసీబీ తీసుకున్న నిర్ణయంతో తీవ్ర అవమానం జరిగింది. లార్డ్స్ లో జరిగేది టెస్టు, వన్డే, టీ20 అనే తేడా లేకుండా ఎప్పుడూ నిండుగా ఉండే స్టేడియంలో గురువారం (జూన్ 2) నుంచి ప్రారంభం కాబోయే ఇంగ్లాండ్-న్యూజిలాండ్ తొలి టెస్టు కోసం కనీసం సగం కంటే ఎక్కువ సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.
38
టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ టెస్టు మొదటి నాలుగు రోజులకు దాదాపు 20 వేల టికెట్లు మిగిలియాట. ఈసీబీ.. ఉన్నఫళంగా టికెట్ రేట్లను పెంచడమే దీనికి కారణం అంటున్నారు.
48
ఒక టికెట్ పై సుమారు 100 పౌండ్ల నుంచి 160 పౌండ్ల వరకు రేట్లు పెంచడం వల్లే టికెట్లు అమ్ముడుపోలేదు.దీంతో తొలి రోజుకు 1,800 టికెట్లు, రెండో రోజుకు 2,500, మూడో రోజుకు 4,600, నాలుగో రోజుకు 9,600 టికెట్లు ఖాళీగా ఉన్నాయని సమాచారం.
58
ఇంగ్లాండ్-కివీస్ ల మధ్య గురువారం నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్టుకు ఇంగ్లాండ్ నయా కోచ్ మెక్ కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తో బరిలోకి దిగుతున్నది.
68
అదీగాక కొత్త కోచ్, కెప్టెన్ ల తో కూడిన జట్టు ఏ విధంగా ఆడుతుందో చూద్దామని కూడా ఇంగ్లాండ్ అభిమానులలో కుతూహలం పెరిగింది. కానీ ఈసీబీ తాజా నిర్ణయంతో ఇంగ్లాండ్ కు ప్రేక్షకుల నుంచి తగిన మద్దతు కూడా లభించడం కష్టమే.
78
తాజాగా ఇదే విషయమై ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘ఈ వారం లార్డ్స్ స్టేడియం నిండటం లేదన్న వార్తలు వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. టికెట్ రేట్ల పెంపు వల్లే ఇలా జరిగింది.
88
రేట్లను అంత ఎందుకు పెంచారు...? ఇప్పుడు ఇంగ్లాండ్ లో వేసవి సెలవులు ఉన్నాయి. పిల్లలు తమ కుటుంబాలతో కలిసి సరదాగా మ్యాచ్ చూడాలని వస్తుంటారు.విక్రయం కాని టికెట్స్ ను పిల్లల కోసం 40 పౌండ్లకు ఇచ్చేయండి..’ అని పేర్కొన్నాడు.