కామెంటేటర్‌గా కూడా అదరగొడుతున్న దినేశ్ కార్తీక్... ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ హుస్సేన్‌కి కౌంటర్...

First Published Jun 19, 2021, 5:31 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తాడు క్రికెటర్ దినేశ్ కార్తీక్. 36 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, కామెంటేటర్‌గా కూడా తొలి సెషన్‌లోనే మంచి మార్కులు కొట్టేశాడు...

మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో కలిసి కామెంటేటర్‌గా ఇంగ్లాండ్ చేరుకున్నాడు భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్. వికెట్ల వెనకాల హిందీ, తమిళ్, తెలుగులో సూచనలు ఇస్తూ కనిపించే కార్తీక్, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కామెంటేటర్‌గా కూడా మంచి మార్కులు కొట్టేశాడు...
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే దినేశ్ కార్తీక్ పేరు ట్రెండింగ్‌లో కనిపించింది. అతని కామెంటరీకి అభిమానులం అయిపోయామంటూ సోషల్ మీడియా జనాలు పోస్టులు చేయడం మొదలెట్టారు...
undefined
దినేశ్ కార్తీక్‌ తన కామెంటరీతో జనాలను ఇంప్రెస్ చేయడానికి ప్రధాన కారణం ఇంగ్లాండ్ ప్లేయర్ నాజర్ హుస్సేన్‌కి ఇచ్చిన కౌంటర్... ఇంతకీ ఏం జరిగిందంటే...
undefined
‘రోహిత్ షార్ట్ బాల్‌ను అద్భుతంగా పుల్ చేయగలడు. స్పిన్‌కి తగ్గట్టుగా అతను కాళ్లను కదుపుతూ, మంచి పాజిటివ్ ఇంటెంట్‌తో షార్ట్స్ ఆడతాడు...’ అంటూ కామెంట్ చేశాడు నాజర్ హుస్సేన్. దానికి వెంటనే ‘అవును... కచ్ఛితంగా మీకు అపోజిటిగా ఆడతాడు’ అన్నాడు దినేశ్ కార్తీక్...
undefined
అదీకాకుండా 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో భారత జట్టు తొలి 6 ఓవర్లలో చేసిన పరుగుల కంటే, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ తొలి ఆరు ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసిందని చెప్పాడు దినేశ్ కార్తీక్...
undefined
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ కూడా దినేశ్ కార్తీక్ చమత్కారాన్ని, అతని కామెంటరీ స్టైల్‌ని ప్రశంసించడం విశేషం....
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలి వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్. అయితే వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా...
undefined
34 పరుగులు చేసిన రోహిత్ శర్మను జెమ్మీసన్ అవుట్ చేయగా, 28 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, నీల్ వాగ్నర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 6 పరుగులు చేసి, పూజారా పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
undefined
click me!