అందమైన భార్య ముఖాన్ని చూపించడానికి ఇర్ఫాన్ పఠాన్ భయపడుతున్నాడని, అందుకే ఆమె ఫేస్ ఎవ్వరికీ కనిపించకుండా ఫోటోలు పోస్టు చేస్తున్నాడంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు.
ఈ కామెంట్లపై స్పందించిన భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. ‘నా భార్యకు తన ముఖాన్ని సోషల్ మీడియాలో చూపించడం ఇష్టం లేదు. నా అకౌంట్ నుంచి పోస్టు చేసే ఫోటోల్లో చాలావరకూ ఆమెనే పోస్టు చేస్తుంది. తను ముఖం చూపించాలని ఉంటే చూపిస్తుంది లేదంటే లేదు. నేను ఆమెకి భర్తని మాత్రమే, మాస్టర్‌ను కాదు’ అంటూ సమాధానం ఇచ్చాడు.
తాజాగా తన ఫోటోపై రేగుతున్న దుమరానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సఫా బేగ్, మీడియా ముందుకొచ్చింది. ‘నేను మా కొడుకు ఇమ్రాన్ కోసం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడు. నాకు నచ్చిన ఫోటోలు అందులో పోస్టు చేస్తూ ఉంటాను. అతను పెద్దయ్యాక ఈ ఫోటోలు గుర్తుగా ఉంటాయని అలా చేశాను.
దానితో పాటు ఇర్ఫాన్ పఠాన్ అకౌంట్ కూడా అప్పుడప్పుడూ అపరేట్ చేస్తూ ఉంటా. ఈ ఒక్క ఫోటో, ఆ అకౌంట్ నుంచి పోస్టు చేశా. నా ముఖం కనిపించకూడదనే నేనే బర్ల్ చేశా. అది పూర్తిగా నా స్వంత నిర్ణయం.
ఇర్ఫాన్ పఠాన్‌కి నా ముఖం చూపించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అతను నాకు ప్రతీ విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. పెళ్లాయాక ఇండియాకి వచ్చేటప్పుడు నేను కొత్త పాస్‌పోర్ట్ కోసం అప్లై చేద్దామని వెళ్లాను.
అయితే కౌంటర్‌లో ఉన్న మహిళ, నా ఇంటి పేరును మూడు సార్లు అడిగింది. ‘సార్, మీ ఆవిడ మీ ఇంటి పేరును పెట్టుకోవడం లేదు. ఇది మీకు సమ్మతమేనా’ అని ఇర్ఫాన్ పఠాన్‌ను ప్రశ్నించింది.
దానికి అతను ఆమెకి ఏది ఇష్టమైతే అదే చేయనివ్వండి. నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. తనకేం కావాలో ఎంచుకునే హక్కు తనకి ఉంది’ అని ఇర్ఫాన్ పఠాన్ సమాధానమిచ్చాడు. అది ఇర్ఫాన్ పఠాన్ వ్యక్తిత్వం.
బట్టలు ఏం వేసుకోవాలో ఎవరికి వాళ్ల ఇష్టాలు ఉన్నట్టే, సోషల్ మీడియాలో ముఖం చూపించడానికి కూడా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. నాకు నా ముఖం చూపించడం ఇష్టం లేదు. అడగడానికి మీరెవ్వరు. సైబర్ బుల్లియింగ్ ఏ మాత్రం అంగీకారయోగ్యం కాదు’ అంటూ వివరించింది సఫా బేగ్.
కొడుకును ఎత్తుకుని, భార్య పక్కనే నిల్చొని ఉన్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ నాటి ఫోటోను పోస్టు చేసిన ఇర్ఫాన్ పఠాన్, ఆ ఫోటోలో సఫా బేగ్ ముఖాన్ని మాత్రం కనిపించకుండా బ్లర్ చేశారు. ఇదే ఇంత రచ్చ రేగడానికి కారణమైంది.