Arjun Tendulkar Wedding: అర్జున్, సానియా ప్రేమకథకు కారణం అక్క సారా టెండూల్కర్ అని తెలుసా?

Published : Feb 27, 2026, 06:06 PM IST

Arjun Tendulkar Wedding: సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ పెళ్లికి అంతా సిద్ధమైంది. అయితే వీరి ప్రేమకథ ఎలా మొదలైంది? వీరిద్దరినీ కలిపిన అసలు వ్యక్తి ఎవరో తెలుసా? అర్జున్ అక్క సారా టెండూల్కర్. 

PREV
14
అర్జున్, సానియాల పెళ్లి ఎప్పుడు?

సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్, వ్యాపారవేత్త కూతురు సానియా చందోక్ పెళ్లి మరొక వారం రోజుల్లో  మార్చి 5న జరగనుంది. ఇప్పటికే ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమైపోయాయి. వీరి ప్రేమ గురించి పెద్దగా ఎక్కడా లీక్ కాలేదు. నేరుగా వీరి ఎంగేజ్ మెంట్ జరిగినప్పుడే విషయం బయటికి వచ్చింది.  వీరి ప్రేమ ఎలా మొదలైందోనని తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

24
ప్రేమ మొదలైందిలా?

అర్జున్, సానియా మధ్య ప్రేమ మొదలవకముందే… సానియా చందోక్ సచిన్ కుటుంబానికి బాగా తెలిసిన అమ్మాయి. సచిన్ కూతురు సారా టెండూల్కర్, సానియా చాలా ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్. దీన్ని బట్టి అర్జున్ ప్రేమకు పునాధి వేసి సారా టెండూల్కర్ స్నేహమే అని చెప్పాలి. లండన్ అయినా, కెన్యా టూర్ అయినా.. సారా ఎక్కడికి వెళ్లినా సానియా కూడా తోడుగా ఉండేది. ఈ స్నేహం చూసే అర్జున్‌కు సానియాపై ప్రేమ పుట్టింది. సారా కోసం సచిన్ ఇంటికి సానియా చాలాసార్లు వచ్చేది. ఇంట్లో పూజలు, ఫంక్షన్లలో పాల్గొనేది. అలాగే సానియా కుటుంబ కార్యక్రమాలకు సచిన్ ఫ్యామిలీ కూడా వెళ్లేది. అలా ఇక్కడే అర్జున్, సానియా ప్రేమ చిగురించింది.

34
పెళ్లికి పెద్దల అంగీకారం

సచిన్ టెండూల్కర్, సానియా చందోక్ తాత రవి ఘయ్  కూడా మంచి స్నేహితులు. సచిన్ క్రికెట్ దిగ్గజం అయితే, రవి ఘయ్ గ్రావిస్ గ్రూప్ ఛైర్మన్. ఇద్దరూ ముంబైకి చెందినవారే. అందుకే టెండూల్కర్, రవి ఘయ్ కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా స్నేహబంధం ఉంది. అందుకే వీరి ప్రేమకు పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ముంబైలో పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

44
పెళ్లికి వచ్చే ప్రముఖులు
అర్జున్, సానియా పెళ్లికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే సహా పలువురు నేతలకు ఆహ్వానాలు అందాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెట్ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు.
Read more Photos on
click me!

Recommended Stories