IPL 2025: కెప్టెన్సీ వదులుకున్న కేఎల్ రాహుల్.. ఢిల్లీ కొత్త కెప్టెన్ ఎవరు?

Published : Mar 12, 2025, 04:22 PM ISTUpdated : Mar 12, 2025, 05:12 PM IST

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేస్తారని అనుకున్నారు. కానీ, అతను కెప్టెన్ పదవి వద్దనడంతో కొత్త కెప్టెన్ ఎవరవుతారనే ఆసక్తి నెలకొంది. 

PREV
15
IPL 2025: కెప్టెన్సీ వదులుకున్న కేఎల్ రాహుల్.. ఢిల్లీ కొత్త కెప్టెన్ ఎవరు?

IPL 2025 KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (ఐపీఎల్ 2025) కోసం జట్లు రెడీ అవుతున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఉన్న భారత ఆటగాళ్లు కాకుండా మిగతా ప్లేయర్స్ ముందుగానే టీమ్‌తో జాయిన్ అయ్యారు. 18వ సీజన్‌కు కెప్టెన్‌ను ప్రకటించని ఏకైక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, డుప్లెసిస్ కెప్టెన్ రేసులో ఉన్నారు. ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఇద్దరూ ముందున్నారు.

25
ఐపీఎల్ 2025

ఐఏఎన్ఎస్ నివేదికల ప్రకారం.. రాబోయే ఐపీఎల్ సీజన్ లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడు. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ వదులుకున్నాడు. దీంతో ఇప్పుడు అక్షర్‌కు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. "ఐపీఎల్ 2025లో అక్షర్ పటేల్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్లు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా చేయాలనుకున్నారు. కానీ, అతను వద్దని చెప్పి బ్యాట్స్‌మెన్‌గా ఆడతానన్నాడు" అని ఐఏఎన్ఎస్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

35
ఢిల్లీ క్యాపిటల్స్

అక్షర్ పటేల్ ఇప్పటివరకు ఏ జట్టుకు కెప్టెన్‌గా చేయలేదు. పాకిస్తాన్, దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతను ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో ఇండియాకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అంటే అక్షర్ పటేల్ కు పెద్దగా కెప్టెన్సీ ఎక్స్‌పీరియన్స్ లేదు. 

ఇక కేఎల్ రాహుల్‌కు లీడర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సీనియర్ ప్లేయర్ ఇండియాకు కూడా కెప్టెన్‌గా పనిచేశాడు.

45
ఢిల్లీ టీమ్ కొత్త కెప్టెన్

కాబట్టి కేఎల్ రాహుల్ తప్పుకోవడంతో ఢిల్లీ కెప్టెన్ గా అక్షర్ పటేల్ వచ్చే అవకాశముంది. అతను కెప్టెన్ అయితే, డీసీని మొదటి టైటిల్ కోసం ముందుకు నడిపించాలి. ఎందుకంటే 2008లో ఢిల్లీ ఐపీఎల్ ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్లు టైటిల్ గెలుచుకోలేకపోయారు. ఇంకా కప్పు గెలవడానికి ట్రై చేస్తున్నారు. రాబోయే సీజన్ లో అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ పై ఢిల్లీ టీమ్ భారీ అంచనాలే పెట్టుకుంది. హేమాంగ్ బదానీ ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కోచ్ గా ఉన్నారు.

 

55

గుజరాత్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 2019 నుండి ఢిల్లీ టీమ్ లో ఉన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు 18 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది డీసీ.  అక్ష‌ర్ ప‌టేల్ ఐపీఎల్ కెరీర్‌లో లో 150  మ్యాచ్ ల‌లో 130.88 స్ట్రైక్ రేట్‌తో 1,653 పరుగులు చేశాడు. 7.28 ఎకానమీ రేటుతో తన ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్‌తో 123 వికెట్లు పడగొట్టాడు.

IPL 2025 ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 

అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్, కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, టి నటరాజన్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, ఫాఫ్ డు ప్లెసిస్, దుష్మంతల్ చమీర, దర్శన్ ఎన్‌కన్‌డే, విపంతరాజ్ చమీరా, ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ.

Read more Photos on
click me!

Recommended Stories