INDvsAUS: ఆస్ట్రేలియాకు షాక్... డేవిడ్ వార్నర్‌కు గాయం... చివరి వన్డే, టీ20 సిరీస్‌కు దూరం...

First Published | Nov 30, 2020, 10:51 AM IST

INDvsAUS: వరుసగా రెండు వన్డేల్లో గెలిచి, సిరీస్ సొంతం చేసుకున్న ఆతిథ్య ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. మొదటి రెండు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయంతో మూడో వన్డేకి, టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. 

టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు... శిఖర్ ధావన్ ఆడిన షాట్‌ను ఆపబోయిన వార్నర్ కిందపడిపోయాడు...
డేవిడ్ వార్నర్ తొడ కండరాలు పట్టేయడంతో నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఫిజియో సాయంతో పెవిలియన్ చేరుకున్నాడు వార్నర్...

డేవిడ్ వార్నర్ గాయం తీవ్రం తెలుసుకునేందుకు వార్నర్‌కు ఎక్స్‌రే తీయించాలని నిర్ణయించుకున్న ఫిజియో, కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు..
డేవిడ్ వార్నర్‌కు తొడ కండరాల గజ్జల్లో గాయం అయ్యిందని తెలిపిన గాయం తగ్గడానికి 6 వారాల సమయం పడుతుందని తెలిపారు. దీంతో మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్‌కు కూడా డేవిడ్ వార్నర్ దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయితే టెస్టు సిరీస్ సమయానికి డేవిడ్ వార్నర్ కోలుకుని తిరిగి రీఎంట్రీ ఇస్తాడని అంచనా వేస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా...
మొదటి రెండు వన్డేల్లో కెప్టెన్ ఆరోన్ ఫించ్‌తో కలిసి శతాధిక భాగస్వామ్యాలు నెలకొల్పాడు డేవిడ్ వార్నర్... ఈ ఇద్దరి భాగస్వామ్యం టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది.
మొదటి వన్డేలో గాయపడిన ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ రెండో వన్డేలో బరిలో దిగలేదు. అతని గాయం తీవ్రత పెద్దది కాకపోవడంతో చివరి వన్డేలో స్టోయినిస్ కమ్ బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ మొత్తం మంచి ఫామ్‌లో ఉన్నారు. స్టీవ్ స్మిత్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ 62 బంతుల్లో సెంచరీలు చేయగా... ఫించ్, వార్నర్, మ్యాక్స్‌వెల్, లబుషేన్ కూడా బ్యాటుతో ఆకట్టుకున్నారు.
డేవిడ్ వార్నర్ ఒక్కడు దూరమైనంత మాత్రం ఆస్ట్రేలియాకి పెద్దగా నష్టం వాటిల్లే అవకాశం అయితే లేదు. కాకపోతే టెస్టుల్లో వార్నర్ ఆడకపోతే ఆసీస్‌కి కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.

Latest Videos

click me!